ఏపీలో కీలక పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. ఒక రాజధాని స్థానంలో మూడు రాజధానులు వస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీకి సంబంధించిన గణాంకాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. అవి చూస్తే ఏపీ వాసులుగా గుండెకలుక్కుమనక మానదు. ఎందుకంటే.. అంత దారుణంగా ఉంది మన పరిస్థితి. మొత్తం దక్షిణాదిలో మనమే వెనుకబడి ఉన్నాం. మంత్రి చెప్పిన ఆ గణాంకాల వివరాలు ఏంటంటే..

 

ఆదాయం తక్కువ, ఎక్కువ అప్పులతో ఉన్నామని బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ లెక్కలతో సహా నివేదిక ఇచ్చింది. పర్ కేపిటా జీఎస్డీపీ చూస్తే కర్నాటక, కేరళ, తెలంగాణ రూ. 2 లక్షలు, తమిళనాడు రూ. 1.9లక్షల ఆదాయంతో ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం కేవలం రూ. 1.6 లక్షల దగ్గరే ఉంది. జిల్లాల వారీగా పర్ కేపిటా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం వెనకబడి ఉన్నాయి. వ్యవసాయంలో చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం ఉన్నాయి. చదువుల్లో విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాలు వరుసగా వెనకబడి ఉన్నాయి.

 

" చంద్రబాబు చెబుతున్న గ్రాఫిక్స్ అమరావతి నగరం కట్టాలంటే ప్రతి పదివేల మందికి కనీసం 30 వేల కోట్లు అవసరమని రిపోర్టు చెబుతోంది. గడిచిన 50 ఏళ్లలో కట్టిన నగరాలు చూసుకుంటే జరిగిన అభివృద్ధి శూన్యం. అర మీటరు నీరొస్తే ఇప్పుడున్న అమరావతి రాజధానిలో 70 శాతం మునిగిపోయే ప్రమాదం ఉందని ఐఐటీ మద్రాస్ రిపోర్టులో పేర్కొంది.

 

"దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంతో చూసకున్నా మనం వెనకబడి ఉన్నాము. గడిచిన ఐదేళ్లలో వ్యవసాయం మీద ఆధారపడి బతకడం పెరిగిందే తప్ప తగ్గలేదని లెక్కల్లో స్ఫష్టమవుతోంది. గడిచిన ఐదేళ్లలో రెవెన్యూ లోటు చూస్తే దాదాపు రూ. 66 వేల కోట్లు దాటింది. మొత్తం లోటు చూస్తే లక్షా 40 వేల కోట్లుకు చేరింది. అప్పు 3 లక్షల కోట్లకు చేరింది. విద్యుత్ పరంగా చూస్తే దాదాపు 20 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.

 

ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో ముంచకుండా భావితరాల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించి ముందడుగు వేసిందన్నారు మంత్రి బుగ్గన. వాస్తవాలు ఇంత దారుణంగా ఉన్నప్పుడు మనకు రాజకీయాలు అవసరమా.. అభివృద్ధి కోసం అంతా ఒక్కటి కాలేమా అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: