తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సంగ్రామానికి నేటితో తెరపడింది. ఎప్పుడైతే ఎలక్షన్స్ అని డిసైడ్ చేశారో అప్పటి నుండి. ప్రచారాలతో ప్రతి గల్లిలో లొల్లి లొల్లి. ఈ హోరుకు నేటితో సమాప్తి పలికారు.. ఇకపోతే రిజర్వేషన్లు ఖరారు అయిన నాటినుంచి ఇప్పటి వరకూ అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారలు నిర్వహించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ ప్రచారం చేసారు. అంతే కాకుండా రోడ్‌ షోలు నిర్వహిస్తూ పట్టణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు..

 

 

ఓటర్లను ప్రలోభ పెట్టే వారి పెట్టారు. మొత్తానికి విజయం తమదే అనే ధీమాతో అధికార పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు... ఇక టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులకు మద్దతునిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రచారం నిర్వహించారు. ఇదే కాకుండా సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగే ప్రచారాన్ని పర్యవేక్షిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచనలిస్తూ, కేటీఆర్‌ ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పాత్ర పోషించారు.. ప్రతిపక్షాలు కూడా యమ హుషారుగా ప్రచారంలో పాల్గొన్నారు..

 

 

ఇక ఎంఐఎం తరఫున ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా వామపక్షాలు, టీజేఎస్‌ తదితర పార్టీల నేతలు కూడా ప్రచారం నిర్వహించారు. ఇకపోతే ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రులుగా బరిలో ఉన్న దాదాపు 3 వేల మందికిపైగా అభ్యర్థులు సైతం సత్తా చాటేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.

 

 

ఇక అధికార టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీల నుంచి కూడా రెబల్స్‌ బరిలో ఉండటంతో వారి ప్రభావం ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులపై ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు అన్ని వర్గాల్లో నెలకొంది.. ఇక కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో 24వ తేదీ ఎన్నికలు ఉండడంతో బుధవారం వరకు ప్రచారానికి అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇకపోతే పోలింగ్‌కు ఒక్క రోజే గడువు ఉండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వారి ప్రయాత్నాలు వారు చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: