అమరావతి ప్రాంతంలో చంద్రబాబు హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు తన వర్గ ప్రజలకు తన పార్టీ నేతలకు అదేవిధంగా బినామీలకు కుటుంబ సభ్యులకు మేలు చేకూరే విధంగా ఒక పథకం ప్రకారం అమరావతి ప్రాంతంలో రాజధానిని ప్రకటించడం జరిగిందని తాజాగా జరిగిన అత్యవసర అసెంబ్లీ సమావేశాలలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలపడం జరిగింది. అంతేకాకుండా ఎవరు ఎక్కడ ఎన్ని ఎకరాలు ఎంత కొన్నారు ఎంతకి కొన్నారు సర్వే నెంబర్లతో సహా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో అన్ని వివరాలు బయట పెట్టి తాజాగా వచ్చిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఆ విధంగా కాకుండా అభివృద్ధి అనేది ఏ ఒక్క వర్గానికి ఏ ప్రాంతానికి పరిమితం కాకుండా అందరికీ న్యాయం జరగాలని వికేంద్రీకరణ జరగాలని విశాఖపట్టణంలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయబోతున్నట్లు దానివలన ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా ఉండకుండా అభివృద్ధిలోకి రాబోతున్నట్లు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన ప్రాంతాలుగా ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని వలస వెళ్లే రోజులు ఇంక ఉండవు అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీ సమావేశాల్లో తెలపడం జరిగింది.

 

దీంతో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ అంశం గురించి మేధావులు ప్రజాసంఘాల నేతలు జగన్ తీసుకున్నది కరెక్టు నిర్ణయమని మద్దతు తెలుపుతున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో శివరామకృష్ణన్ కమిటీ సభ్యులుగా ఉన్న మాజీ వీసీ ప్రొఫెసర్ కేఎస్ చలం విశాఖపట్నం నగరానికి కేంద్రంగా చేసుకుని పరిపాలించడానికి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ నిర్ణయమని మూడు రాజధానుల కాన్సెప్ట్ బెస్ట్ కాన్సెప్ట్ అని పేర్కొన్నారు.

 

మొత్తంమీద చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర రాజధాని గురించి సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని కరెక్ట్ అని రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం వేస్తున్న అడుగులు చాలా కరెక్ట్ అంటూ ప్రజా సంఘాల నేతలు మరియు మేధావులు జగన్ నిర్ణయాలకు జై కొడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: