2013 సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో 23 ఏళ్ల యువతిపై కామంతో కళ్లు మూసుకుపోయిన ఆరుగురు మృగాల్లాంటి మగాళ్లు అతి దారుణంగా అత్యాచారం చేసిన విషయం. గ్యాంగ్ రేప్ చేసిన అనంతరం ఆమె మర్మంగాల్లోకి పదునైన వస్తువులు జొపించడంతో తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది . కాగా ఈ కేసులో నిందితులను శిక్షించడానికి ప్రత్యేకంగా నిర్భయ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎట్టకేలకు ఇన్నాళ్ళకి నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష పడింది. అయితే నిర్భయ అత్యాచారం కేసులో ఆరుగురు నిందితులు ఉండగా ఒక నిందితుడు మైనర్ అని తేలడంతో మూడేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు మరో నిందితుడు జైలులో శిక్ష అనుభవిస్తునే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న నలుగురు నిందితులకు కోర్టు ఉరిశిక్షను విధించింది. 

 


 కాగా  తమ ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఇప్పటికే నిర్భయ కేసులో నిందితుడైన పవన్ కుమార్ గుప్తా సుప్రీంకోర్టు తో పాటు పలు కోర్టుల్లో  పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఎన్ని సార్లు కొట్టి వేసినప్పటికీ కూడా పవన్ కుమార్ గుప్తా మాత్రం పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఫిబ్రవరి 1న నిర్భయ కేసులో నిందితులకు ఉరి తీసేందుకు కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మరణశిక్షను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో దోషి పవన్ కుమార్ గుప్తా తాజాగా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

 

 ఈ సందర్భంగా నిర్భయ కేసులో దోషి పవన్ కుమార్ గుప్తా తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారం చేసిన సమయంలో తాను మైనర్ ని  కాబట్టి తనను ఉరి శిక్ష నుంచి తప్పించాలీ  అంటూ దోషి పవన్ కుమార్ గుప్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే నిందితుడు పవన్ కుమార్ గుప్తా పిటిషన్  పై స్పందించిన సుప్రీం కోర్టు ఒకే విషయం మీద ఎన్ని సార్లు కోర్టుకు వస్తారు అంటూ పవన్ కుమార్ గుప్తా తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది . అంతకుముందే ఈ కేసులో మరో నిందితుడు ముఖేష్ తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని అంటూ రాష్ట్రపతిని కోరిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: