ఒకరు 40 ఏళ్ళు దాటిన నేత...మరొకరు 40 ఏళ్లపైనే రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. అయితే 40 ఏళ్ళు అనుభవం గల పెద్ద మనిషి...40 ఏళ్ల కుర్రాడి ముందు పూర్తిగా తేలిపోతున్నారు. ప్రతి విషయంలోనూ రాజకీయం చేస్తూ ఘోరంగా విఫలమవుతున్నారు. ఇంతకి 40 ఏళ్ల కుర్రాడి ముందు తేలిపోతున్న పెద్దమనిషి ఎవరో ఈ పాటికే అర్ధమైపోయి ఉంటుంది. ఉమ్మడి ఏపీ విడిపోయాక, అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తారని ఏపీ ప్రజలు 2014లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పట్టం కట్టిన విషయం తెలిసిందే.

 

అయితే ఆయన అనుభవం ఉపయోగించి, అయిన వాళ్ళకు దోచిపెట్టడం, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం, ప్రజలని అధోగతి పాలు చేయడంతో ప్రజలు 2019లో 40 ఏళ్ళు దాటిన యువకుడు జగన్‌కు పట్టం కట్టారు. ఇక తొలిసారి సీఎం పీఠం ఎక్కిన జగన్ పాలన చేయాలంటే అనుభవమే కాదు...ప్రజలకు మేలు చేయాలనే మంచి మనసు ఉంటే చాలని నిరూపిస్తూ దూసుకెళుతున్నారు. కేవలం 8 నెలల్లోనే ఊహించని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి సంచలనం సృష్టించారు. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు లక్షల్లో ఉద్యోగాలు కల్పించి యువకులకు అండగా నిలిచారు.

 

ఇలా అన్నీ ప్రాంతాలకు, అన్నీ వర్గాలకు సమన్యాయం చేస్తూ ముందుకెళుతున్నారు. ఇదే సమయంలో యువ సీఎంకు ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందనే ఉద్దేశంతో 40 ఏళ్ళు అనుభవం ఉన్న చంద్రబాబు కొత్త ప్రభుత్వానికి ఒక సంవత్సరం కూడా సమయం ఇవ్వకుండా ఏదొక సమస్య ఉందని చెబుతూ రోడ్లపైకి వచ్చి బీదఅరుపులు అరవడం మొదలుపెట్టారు. కానీ బాబు ఎన్ని బీద అరుపులు అరిసిన యువ సీఎం వాటికి చెక్ పెట్టుకుంటూనే వెళ్లారు. బాబు చేసే ప్రతి విష ప్రచారానికి చేతల్లోనే కౌంటర్ ఇస్తూ వచ్చారు.

 

మొదట ఇసుక అంటూ, తర్వాత పి‌పి‌ఏలు, ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు మూడు రాజధానులపైన బాబు చేసిన రచ్చని గట్టిగా తిప్పికొట్టారు. ప్రజలకు మంచి చేసుకుంటూ వెళుతూ...బాబు చేసే ప్రతి రచ్చకు చెక్ పెట్టేశారు. అటు ప్రజలు కూడా జగన్ చేస్తున్న మంచిని, బాబు చేస్తున్న విష ప్రచారాన్ని అర్ధం చేసుకున్నారు. ఫలితంగా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఆయనతోనే నడిచారు. వెరసి ఈ 8 నెలల పాలన కాలంలో 40 ఏళ్ల కుర్రాడి ముందు 40 ఏళ్ల అనుభవం మోకరిల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: