తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉండి కూడా కోట్ల రాపాయల విలువైన భూములు కొన్నవారిని బయటకు రప్పించాలంటే బినామీ చట్టాన్ని ప్రయోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.  రాజధాని అమరావతి  ప్రాంతంలో  చంద్రబాబునాయుడు హాయంలో మొత్తం 797 బినామీ లావాదేవీలు నడిచినట్లు ఇప్పటికే సిఐడి నిర్ధారణకు వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి మీడియా చెబుతోంది.

 

ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం రాజధాని పరిధిలోని గ్రామాల్లో  చంద్రబాబు, చినబాబు, మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, ఎంఎల్ఏలు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు మొత్తం కలిపి 4075 ఎకరాలను దోచేశారు. వీరిలో కొందరు తమ పేర్లు మీద, తమ సంస్ధల పేర్ల మీదే భూములు కొనుగోలు చేశారు. అయితే ఇటువంటి వాళ్ళ సంఖ్య తక్కవనే చెప్పాలి. మెజారిటి భూములు కొనుగోలు చేసిన వాళ్ళ సంబంధీకుల పేర్లపైనే ఉన్నట్లు తేలింది.

 

ఈ సంబంధీకులే ఎవరయ్యా అంటే నేతల ఇళ్ళల్లో పనిచేసే డ్రైవర్లు, వంటవాళ్ళు, పనిమనుషులు అన్నమాట. వీళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే పేదలన్న మాటే.  ఈ విషయాలు ప్రభుత్వానికి ఎలా తెలిసిందంటే రిజిస్ట్రార్ కార్యాలయంలో వీళ్ళ పేర్లతో ఉన్న ఆధార్ కార్డుల ఆధారంగా విచారణ జరిపితే  వీళ్ళ ఆర్ధిక స్తోమతేంటో తేలిపోయింది. దాంతో వాళ్ళంతా భూములు దోచేసిన వారి బినామీలే అనే నిర్ధారణకు వచ్చింది సిఐడి.

 

అందుకనే వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వటానికి రెడీ అవుతోంది. ఇప్పటికే 797 మంది వివరాలను పూర్తిగా ఆన్ కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించింది.  సిఐడినే బినామీలుగా తేలిన వాళ్ళకు నోటీసులిచ్చి, కేసులు పెట్టి తర్వాత ఆ కేసులను ఐటి విభాగానాకి ఇవ్వాలా ? లేకపోతే సిఐడినే విచారణ కూడా పూర్తిచేసి తర్వాత  కేసును ఐటి విభాగానికి అప్పగించాలా అన్న విషయంలో స్పష్టత రాలేదని సమాచారం.   మొత్తానికి భూములు రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళకు గనుక నోటీసులు ఇచ్చి 420, 406, 418 సెక్షన్ల క్రింత చర్యలు మొదలైతే అసలు సొంతదారులు కలుగుల్లో నుండి ఎలుకలు బయటకు వచ్చినట్లు వస్తారనటంలో సందేహం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: