ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేస్తున్న ఆందోళన విషయంలో రాష్ట్రంలోని ప్రజలంతా తిరస్కార భావంతో ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ఒకే ఒక్క ప్రాంతంలో తప్పించి 3 రాజధానుల విషయమై ఎక్కడా వ్యతిరేకత రాకపోవడంతో చంద్రబాబు వారిని ఏ విధంగా ఉసిగొల్పారో మనం అర్థం చేసుకోవచ్చు. గడిచిన నెల రోజులు పైనే అమరావతి మీద విపరీతమైన ఆందోళనలు చేపడుతున్న చంద్రబాబు ఏపీ రాజధాని తరలింపు పై సర్కారు యోచిస్తుందే తప్ప ఇంకా ఫైనల్ గా తన నిర్ణయాన్ని వెల్లడించే లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు చేసే పనులు కనీసం వారి పార్టీ ప్రధాన నాయకులకు కూడా నచ్చడం లేదు అని.

 

జోలిపట్టి నిరసనలకు నిధులు వసూలు చేసిన చంద్రబాబు ఇతర జిల్లాల నుంచి సానుకూల స్పందన లేని పరిస్థితిలో ఆందోళనలు మరింత పెంచేందుకు తన పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ ను రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్టు బాలయ్య టూర్ ప్రోగ్రాం ను ఖరారు చేసి మీడియా ముందు కూడా రిలీజ్ చేశారు. అయితే సినిమా హీరో బాలయ్య తనదైన శైలిలో మాట్లాడి రాజధాని విషయంలో టీడీపీ యొక్క మైలేజీ పెంచుతారని ఆశించిన చంద్రబాబుకి అతని సొంత వియ్యంకుడే షాక్ ఇచ్చాడు. 

 

ఏమైందో ఏమో తెలియదు కానీ బాలకృష్ణ రాలేదు. ఇంకా అతను ఎప్పుడూ పాల్గొంటారన్న సమాచారం కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ర్యాలీ చేపట్టకపోతేనే బాగుంటుందన్న ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్లుగా అతని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఏదో ఒక సాకు పెట్టుకొని ఆందోళన కార్యక్రమానికి ఆయన డుమ్మా కొట్టారని.... ఇంకా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆందోళనలో పాల్గొనడం కన్నా బాలయ్య వాయిదా వేసుకుందామని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. అయితే బాబు మాత్రం బాలయ్య విషయంలో పట్టుబట్టి మరీ అతనిని ఎలాగైనా దీనిలో పాల్గొనేలా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: