వరుసగా రెండోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక చాలా సైలెంటు గా జరిగిపోయింది. బిజెపి ఘనమైన చరిత్రను చాటుతూ ఇన్ని రోజులు పార్టీకి తన సేవలు అందించిన అమిత్ షా యొక్క కాల పరిమితి ముగియగానే ఇప్పుడు అందరికీ ఇష్టుడు అయిన జగత్ ప్రకాష్ నడ్డా అలియాస్ జెపి నడ్డా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు హిమాచల్ ప్రదేశ్ శాఖకు చెందిన జేపీ నడ్డా తప్పించి అధ్యక్ష పదవికి ఒక్కరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో అతని ఎన్నిక ఏకగ్రీవం కాగా రేపటి నుంచి అతను పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరిస్తారు.

 

హిమాచల్ ప్రదేశ్ బిజెపి నాయకుడు నాయకుడిగా అందరికీ పరిచయస్తుడు అయినా జేపీ నడ్డా మాత్రం బీహార్ లోని పాట్నాలో చదువుకున్నారు. లా మాత్రం హిమాచల్ ప్రదేశ లో పూర్తిచేసిన నడ్డా ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఇతను ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 2019 లో అనూహ్య ఫలితాలు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు.  పెద్దగా అంచనాలు లేని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 80 ఎంపీ సీట్లకు గానూ 62 ఎంపీ సీట్లు గెలవడం అందర్నీ ఆశ్చర్యానికి ముంచెత్తింది.

 

వరుసగా రెండో సారి కూడా అత్యధిక మెజారిటీతో పార్టీ సీట్లు గెలవడంలో అతని చాకచతను మోడీ గుర్తించారు. ప్రస్తుతం జేపీ నడ్డా వయసు 59 సంవత్సరాలు కాగా అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి 60 ఏళ్ల లోపు అధ్యక్ష హోదాలో వెళ్లడం చిన్న విషయం అయితే కాదు.  ప్రస్తుతం దేశంలో బిజెపి అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో అమిత్ షా పైన నమ్మకం పోయిన మోడీ జేపీ నడ్డా 2024 ఎన్నికల్లో తమను ఒడ్డుకు చేరుస్తాడు అని  ఆశాభావంతో ఉన్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: