ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క రోజుకు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభా నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 

జై అమరావతి.. జైజై అమరావతి. మూడు రాజధానులు వద్దు. ఒక్క రాజధాని ముద్దుఅంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పలుమార్లు స్పీకర్ తో పాటు జగన్ మోహన్ రెడ్డి వారిని శాతంగా కూర్చోమని వారించినా కూడా వారి ప్రవర్తన మారకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ వారిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది.

 

దీంతో వారిని మార్షల్స్ సాయంతో బయటకు పంపాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. అనంతరం కొద్దిసేపటి తర్వాత 17 మంది ఎమ్మెల్యేలను సభ నుంచి ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

 

సభ నుంచి సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు:

 

అచ్చెన్నాయుడు

ఆదిరెడ్డి భవాని

ఏలూరి సాంబశివరావు

అనగాని సత్యప్రసాద్

బుచ్చయ్య చౌదరి

చినరాజప్ప

వెంకట రెడ్డి నాయుడు

మంతెన రామరాజు

గద్దె రామ్మోహన్

జోగేశ్వరరావు

వెలగపూడి రామకృష్ణ

వాసుపల్లి గణేశ్

పయ్యావుల కేశవ్

జేగేశ్వరరావు

గొట్టిపాటి రవి

నిమ్మల రామానాయుడు

కరణం బలరాం

మరింత సమాచారం తెలుసుకోండి: