శృంగారం అనేది జీవితంలో కేవ‌లం ఒక భాగం మాత్ర‌మేగాని దానికోసం జీవితాల్ని నాశ‌నం చేసుకునేంత‌లా ఉండ‌కూడ‌దు. ఈ శృంగారాన్ని కొంత‌మంది మ‌ధురానుభూతిగా ఎంతో ప్రైవ‌సీగా భార్యా భ‌ర్త‌ల‌కి వాళ్ళ‌కి అస‌లు ఆ బంధం ఉందా అన్న‌ట్లు ఎంతో గోప్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. న‌లుగురి తెలిసే విష‌యం కాదు కాబ‌ట్టి ఎంతో డిగ్నిటీ మెయిన్‌టెయిన్ చేస్తారు. ఇలా కొంత మంది ఉంటే... మ‌రి కొంత‌మంది బ‌రితెగించి శృంగార కోరిక‌లనేవి పైశాచికంగా మార‌డం మొద‌ల‌య్యాయి. అవి ఎలాంటివంటే చెప్పుకోవ‌డానికి కూడా చాలా అస‌హ్యంగా ఉంటాయి. ఇక అలాంటివి వింటే వారి పిచ్చి ప‌రాకాష్ట అనే చెప్పాలి. 

 

బుర్లింగ‌మ్ అనే 33 ఏళ్ళ యువ‌తి భ‌ర్త పేరు పీట‌ర్ టేల‌ర్ ఆయ‌న వ‌య‌సు కూడా 33 ఏళ్ళే. ఈ దంప‌తులిద్ద‌రు చిన్న పిల్ల‌ల పై లైంగిక దాడికి ఒడిగ‌ట్టారు. ముక్కు ప‌చ్చ‌లార‌ని ప‌సిపిల్ల‌ల‌పై అరాచ‌కాలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. పీట‌ర్ టేల‌ర్ ఓ రోజు త‌న భార్య బుర్లింగ‌మ్‌ను కామ్ వాంచ‌ను తీర్చుకునేందుకు స్కూల్ డ్ర‌స్ వేసుకుని ర‌మ్మ‌న్న‌డు. ఆమె స్కూల్ డ్ర‌స్ వేసుకుని వ‌చ్చింది. దాంతో ఆ రోజు నుంచి పీట‌ర్ ఎలాగైన ప‌సిపిల్ల‌ల‌తో సెక్స్ చేయాల‌నే కోరిక మ‌దిలో క‌లిగింది. దీంతో స్కూల్‌ గర్ల్స్‌ మీదకు పీటర్‌ టేలర్‌ మనసు మళ్లింది. 11 ఏళ్ల నుంచి ఐదేళ్ల వయస్సున్న ఆడ, మగ పిల్లలపై అత్యాచారం జరిపారు. ఈ విషయంలో భర్తకు సహకరించిన భార్య బుర్లింగమ్‌ కూడా పిల్లలతో కామవాంఛ తీర్చుకున్నారు. ఇక ఈ ఘ‌ట‌న పై  మాంచెస్టర్‌లోని మిన్‌శుల్‌ స్ట్రీట్‌ క్రౌన్‌ కోర్టు జడ్జీ మార్క్‌ సావిస్‌ శనివారం నాడు మాజీ దంపతులకు శిక్ష విధించారు.

 

స్కూల్‌ డ్రెస్‌తో మొదలైన ఈ తతంగం పిల్లలతో కామవాంఛ తీర్చుకునేత‌ దారుణ స్థాయికి వెళ్లింది. పార్ట్‌టైమ్‌ బేబీ సిట్టర్‌గా పనిచేసిన బుర్లింగమ్‌ ఐదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా   దాన్ని సెల్‌ఫోన్‌ ద్వారా రికార్డు చేసి, ఆ వీడియోను భర్తకు పంపించింది. అప్పటి నుంచి ఆ భార్యా భర్తలిద్దరు కలిసి, విడివిడిగానూ అసభ్యంగా పిల్లలతో గడపడమే కాకుండా వాటిని సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీసి పరస్పరం షేర్‌ చేసుకునే పైత్యానికి దిగారు. ఆ తర్వాత వారి మధ్య పరస్పరం మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయినప్పటికీ వారు పిల్లలతో పెట్టుకున్న సంబంధాన్ని వదులుకోలేక పోయారు.

 

ఓ రోజు బుర్లింగ‌మ్ త‌న ప‌క్కింట్లో ఉన్న ఐదేళ్ళ బాలుడితో అసభ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఆ కుర్ర‌వాడు వాళ్‌ళ ఇంట్లో విష‌యాన్ని చెప్ప‌గా. విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దాంతో వారు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌గా ముందుగా బుర్లింగ‌మ్ అరెస్ట్ చేసి త‌న ద‌గ్గ‌ర ఉన్న సెల్‌ఫోన్ తీసుకోగా మిగ‌తా విష‌యాలన్నీ వాతంత‌ట అవే బ‌య‌ట‌ప‌డ్డాయి. దాంతో త‌ర్వాత పీట‌ర్‌ను కూడా అరెస్ట్ చేసి విచారించారు. వీరిద్ద‌రికి 15ఏళ్ళ పాటు జైలు శిక్ష‌ప‌డింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: