అమరావతి రాజధాని ప్రాంత రైతుల చేత ధర్నాలు నిరసనలు చేపిస్తూ జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావటానికి నానా తంటాలు పడిన చంద్రబాబు తాజాగా సోమవారం జరిగిన అసెంబ్లీ లో తన హయాంలో జరిగిన భూసేకరణ గురించి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లెక్కలతో సహా చెబుతుంటే ఏం మాట్లాడలేక నోరెళ్ళ పెట్టినట్లు కూర్చున్నారు చంద్రబాబు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పార్టీ నాయకులు అదే విధంగా బినామీలు ఎవరి దగ్గర ఎంత భూములు కొన్నారు ఎన్ని వేల ఎకరాలు కొన్నారు అన్ని విషయాలను బయట పెడుతూ లెక్కలతో సహా చెబుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా అసెంబ్లీ లో ఉన్న వాళ్లు ఎవరు కిక్కురు మనలేదు.

 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం చేసి ఒక ఉద్దేశంతో తన సామాజిక వర్గానికి మాత్రమే మేలు జరిగే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే విధంగా వ్యవహరించారని అన్ని లెక్కలు చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ చంద్రబాబు ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇటువంటి తరుణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం అన్ని విషయాలు తెలుసుకొని విచారణ చేయాలని ...వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో ప్రజలకు అందరికీ తెలియాలని సభా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి తెలియజేయడంతో కచ్చితంగా రాజధాని ప్రాంతంలో భూసేకరణ విషయంలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకువచ్చే విధంగా విచారణ భవిష్యత్తులో చేయబోతున్నట్లు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు.

 

అయితే ఈ సందర్భంగా విచారణ జరిగిన మొత్తం చంద్రబాబు హయాంలో జరిగిన భూసేకరణ విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న విషయం రుజువైతే చంద్రబాబు జన్మలో అమరావతి లోనే కాదు రాష్ట్రంలో కూడా అడుగుపెట్టే ప్రసక్తి ఉండదని జైలు కి పరిమితం కావటం గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు హయాంలో టీడీపీ నాయకులు అమరావతి రాజధాని ప్రాంతంలో కొన్న భూముల లెక్కల వివరాలు హైలెట్ అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: