బిజెపితో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఏపీలో తమకు ఎక్కడలేని బలం వచ్చిందని, ఇక వైసీపీ ప్రభుత్వంపై తాను ఎంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ముందుకు వెళ్లినా  తమ వెనుక బిజెపి అండగా ఉంటుందనే ధైర్యం పవన్ లో ఎక్కువగా కనిపిస్తోంది. నిన్న అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లు విజయవంతంగా ఆమోదం పొందడంతో పవన్ లో మరింత అసహనాన్ని రగిలిస్తోంది. ఈ నేపథ్యం పవన్ రాజధాని గ్రామాల సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.


 నిన్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించిన పవన్ ఆ సమావేశాల అనంతరం అమరావతి పరిసర గ్రామాలకు వెళ్లేందుకు  సిద్ధమయ్యారు. ఉదయం అంతా రైతులపై లాఠీచార్జి జరగడం, దీనిపై నిరసనలు, ఆందోళన చేపట్టిన వారిపై పోలీసులు లాఠీలతో వెంటపడడంతో అమరావతిలో యుద్ధ  వాతావరణం నెలకొంది. దీంతో పోలీసుల ఘటనలో గాయాలపాలైన వారందరిని పవన్ కలిసి ఓదార్చాలనుకున్నారు. అయితే ఈ విషయం ముందుగానే పోలీసులకు తెలియడంతో భారీ ఎత్తున పోలీసులు రంగ ప్రవేశం చేసి జనసేన కార్యాలయం వద్ద కు చేరుకుని పవన్ కళ్యాణ్ పర్యటనకు ముందుకు వస్తే అడ్డుకోవాలని అని చూశారు.


 అలాగే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు. ఇదే సమయంలో జనసేన నాయకుడు పవన్ అన్నయ్య నాగబాబు జనసేన పార్టీ కార్యాలయం బయట ఉన్న మీడియాతో మాట్లాడారు. రైతులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారని, కానీ పోలీసులు అడ్డుకున్నారు అంటూ ప్రకటించారు. కేవలం రైతుల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు సిద్ధమయ్యారు పవన్. పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు పవన్ తన పర్యటనను వాయిదా వేసేందుకు ఇష్టపడలేదు. 


పోలీసు అధికారులు చేసిన సూచనను పట్టించుకోకుండా పవన్ రాజధాని గ్రామాలకు వెళ్లేందుకు బయటకు రాగా, పోలీసులు ఆయన్ను గేటు వద్ద నిలిపి ముందుకు రాకుండా అడ్డుకోవడంతో అక్కడ పవన్ ఫ్యాన్స్ కు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: