ఓటు సామాన్యుని హక్కు. ఐదు సంవత్సరాల పాలనకు అందించే చేయుత ఈ ఓటు. ఒకరకంగా ప్రజలకు ఆయుధం వంటిదని చెప్పవచ్చు. అలాంటి ఓటును అమ్ముకోవడానికి సిద్దమైన ఓటర్లకు, ప్యాకేజీల చొప్పున ఓట్లను వేయించుకోవడానికి, అభ్యర్ధులు, నోట్లకట్టలతో పాటుగా, బిర్యాని పొట్లాలు. మందు బాటిళ్లు, లేదా ఇతరమైన గిఫ్ట్‌లు ఇస్తూ తెలంగాణా ముద్దు బిడ్దలం, అవినీతి మరక అంటని నాయకులం అని చెప్పుకునే పెద్దల పార్టీ వర్గాలు ఓటర్లకు వలలు వేస్తున్న తీరు నిజంగా బాధాకరం..

 

 

డబ్బులిచ్చి ఓటు కొనుకున్న పార్టీ అభ్యర్ధులు అభివృద్ధి చేస్తారా. చేయరు కదా. వారు పెట్టిన పెట్టుబడికి ఎలాగైన పదింతలు కూడబెట్టుకోవాలని చూస్తారు.. ఓటర్లు ఎందుకు ఈ చిన్న విషయాన్ని గ్రహించడం లేదో అర్ధం కావడంలేదు. నిజాయితీగా పనిచేసే నాయకునికి పడవలసిన ఓట్లు, అవినీతి తిమింగలాలు తన్నుకు పోతున్నాయి. దీనివల్ల అభివృద్ధి మాట అటుంచితే, ఎలక్షన్స్ ముగిసిన తర్వాత గెలిచిన అభ్యర్ది కనీసం ఓటర్ల ముఖం కూడ చూడడు.

 

 

ఇదిగో కొన్ని ప్రాంతాల్లో ఎంతలా ఈ పంపకాల జోరు సాగుతుందంటే అది ఊహించని స్దాయిలో ఉంది. ఇకపోతే పెద్దపల్లి మునిసిపాలిటీ 2వ వార్డు అధికార పార్టీ అభ్యర్థి తరపున ఆయన బంధువు ఒకరు ఓటర్లను ప్రలోభపెట్టిన తీరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక వర్గం ఓట్ల కోసం రూ.2.40 లక్షలు ఇచ్చి.. వారి దేవుడిపై ప్రమాణం చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారి మదన్‌మోహన్‌రెడ్డి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. ఇదే కాకుండా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, చేస్తున్నారట.

 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రతిచోట ఇదే తంతు. ఇకపోతే హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి వంటి ప్రాంతాలలో ఓటర్లతో సాముహిక విందు ఏర్పాటు చేసి, ఒక్కో గ్రూప్‌నకు రూ.20 వేల వరకు ఇస్తామని హామీ ఇవ్వడంతోపాటు ఓటర్లతో ప్రతిజ్ఞలు చేయించుకుంటున్నారు. జగిత్యాలలోని ఖిల్లాగడ్డలో ఓ పార్టీ అభ్యర్థి డబ్బులు పంచుతుండగా స్వతంత్ర అభ్యర్థి అడ్డుకోవడంతో గొడవ కూడా జరిగిందట... కళ్లముందు జరుగుతున్న ఇలాంటి సంఘటనలు చూస్తున్న కొందరు తెలంగాణ అవినీతిలో ఎంతగా అభివృద్ధి సాధించిందో అని ఆశ్చర్యపోతున్నారట...

మరింత సమాచారం తెలుసుకోండి: