ఈ మధ్యకాలంలో రైతులకు కేంద్రం అని.. రాష్ట్రం అని ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ లు అందుతూనే ఉన్నాయి.. అటు ఆంధ్రలో సీఎం జగన్.. ఇటు తెలంగాణాలో సీఎం కేసీఆర్.. రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రైతన్నలను కాపాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం పీఎం కిసాన్ పెట్టగా.. సీఎం జగన్ రైతు భరోసా అని.. సీఎం కేసీఆర్ రైతు బంధు అని రైతులకు ఆర్ధికంగా సహాయం చేస్తున్నారు. 

 

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చల్లటి వార్త చెప్పింది. రైతు బంధు పథకంలో భాగంగా రబీ పంటకు నిధులు మంజూరు చేసింది. మొత్తం 5,100 కోట్ల నిధులను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి సోమవారం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు... రబీలో రైతులకు పెట్టుబడికి సాయం కింద ఈ నిధులను ప్రభుత్వం అందిస్తుంది. 

 

ఈ రైతు బంధు పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. ఈ పథకాన్ని రైతన్నలకు సహాయంగా ఉండాలనే ఉద్దేశ్యంతో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కాగా 2019-2020 వార్షిక బడ్జెట్ లో రైతుబంధు కోసం 12,862 కోట్ల రూపాయిలు కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది. 

 

ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్ లో రూ.6,862 కోట్లు మంజూరు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా.. తాజాగా ఇప్పుడు రబీ సీజన్ కోసం రూ.5,100 కోట్ల నిధులను విడుదల చేశారు. అయితే రబి సీజన్ నిధులు ఆర్ధిక శాఖ ఇచ్చిన ఉత్తుర్వులు మేరకు వ్యవసాయ శాఖ కూడా పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో రైతు బంధు, రుణ మాఫీ నిధులపై ప్రతిపక్షాలు విమర్శలు చేయగా వాటికి ఎన్నికల ముందే చెక్ పెడుతూ నిధులు విడుదల చేశారు. ఒకరకంగా తెలంగాణ రైతులకు మున్సిపల్ ఎన్నికలు కూడా సహాయంగా నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: