ఏపీ సీఎం జగన్ 2019 ఎన్నికల ముందు 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ అమలు గురించి సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. 2021 సంవత్సరంలో రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. మొదట ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో చెప్పారని సమాచారం.         
 
నిన్న కేబినేట్ సమావేశం జరిగిన సమయంలో కొత్త జిల్లాల ప్రతిపాదన తెరమీదకు రాగా 25 జిల్లాల ఏర్పాటు గురించి చర్చ జరిగింది. ఈ సమయంలో సీఎం తన ఆలోచనలను, ప్రణాళికలను మంత్రులకు చెప్పినట్టు తెలుస్తోంది. పరిపాలన కేంద్రానికి ప్రతిసారి ఎస్పీలను, కలెక్టర్లను పిలవడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీస్ శాఖలో రేంజీల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్న తీరు గురించి కూడా సీఎం జగన్ కేబినేట్ సమావేశంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. 
 
ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి మండళ్లను కలెక్టర్లు కూడా ప్రాంతీయ స్థాయిలో పోలీస్ శాఖ మాదిరిగా ఒక విధానం ఉండాలనే ఆలోచనతో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పాలనను వికేంద్రీకరించటం కొరకు నాలుగు కమీషనరేట్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచనలు చేశారు. కొందరు మంత్రులు అమరావతి ప్రాంతాన్ని వ్యవసాయ హబ్ గా చేయాలని జగన్ కు సూచించగా జగన్ అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. 
 
సీఎం జగన్ అమరావతిని అన్ని రంగాల అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం సూచినంచినట్టు సమాచారం. కేబినేట్ సమావేశంలో వైకుంఠపురం దగ్గర కృష్ణా నదిపై రహదారితో కూడిన ఆనకట్ట నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినేట్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థలో సిబ్బంది నియామకానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: