ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు భూకబ్జాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వైసీపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న పోలీసులు కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన తెలుగుదేశం పార్టీ మహిళా నేతను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే భీమిలిలో షేక్ జహనార అనే మహిళ జీవీఎంసీ నాలుగో వార్డు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా గతంలో పని చేసింది. ఒక మంత్రి సహకారంతో షేక్ జహనార సర్వే నంబర్ 20 లో ఉన్న భూమిని ఆక్రమించటం కొరకు ప్లాన్ చేసి ఇప్పటికే ప్రభుత్వ భూమిలో భవన నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది. గతంలోనే ఈ విషయం రెవెన్యూ, జీవీఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. 
 
రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు ఆ నిర్మాణాన్ని కూల్చివేయగా షేక జహనార మరోసారి అక్కడే భవన నిర్మాణం చేపట్టింది. అధికారులు మరోసారి ఆ నిర్మాణాన్ని కూల్చివేశారు. రెండు సార్లు అధికారులు కూల్చివేసినప్పటికీ షేక్ జహనార అధికారులకు తెలియకుండా అక్కడ భవనాన్ని నిర్మించేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ భవన నిర్మాణం జరిగింది. 
 
తాజాగా షేక్ జహనార వేరే సర్వే నంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టగా విశాఖ రూరల్ తహశీల్దార్ కు ఈ విషయం తెలిసింది. విషయం తెలిసిన వెంటనే తహశీల్దార్ నరసింగారావు సంఘటనా స్థలానికి చేరుకుని పనులను ఆపివేశారు. ఆ తరువాత తహశీల్దార్ షేక్ జహనారపై చర్యలు తీసుకోవాలని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరిపి షేక్ జహనారను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: