రాజధాని పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం కావడం చాలా సంతోషంగా ఉందని రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో అయన మాట్లాడారు. ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటుపై ప్రతి కమిటీలో స్పష్టంగా తెలిపారు. ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు దేనికోసం అని ప్రశ్నిస్తున్నామన్నారు. ఎక్కువ సమయం ప్రతిపక్షంకు అవకాశం కల్పించామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో అడుగు అడుగునా అడ్డుతగిలారని ఆక్షేపించారు.

ప్రతిపక్షం అంటే హుందాగా వ్యవహరించాలని శ్రీకాంత్ రెడ్డి హితవు చెప్పారు. చంద్రబాబు అల్లరి మూకల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి ప్రాధాన్యత ఇస్తుంటే ఎందుకు చంద్రబాబుకు ఆక్రోశం అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతాల్లో చినుకు కోసం కరువు రైతులు ఆకాశానికి ఆశగా ఎదురు చూస్తూనే ఉన్న పరిస్థితిని ఈ సందర్బంగా ప్రస్తావించారు.

శ్రీ బాగ్ ఒడంబడిక చదువుతుంటే మా కంట కన్నీరు వస్తోందని చెప్పారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ హైకోర్టు కేటాయించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ భాదితులకు అండగా నిలుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు.  రాయలసీమ వాసులకు చెరువులు ద్వారా సాగునీరు అందించాలని సీఎంని కోరామన్నారు.

సోమవారం జరిగిన మొదటి రోజు అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు సిగ్గుచేటని అన్నారు. మీరు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబును ఉద్యేశించి అన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చంద్రబాబు వైఖరిని ఎత్తిచూపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అంతా సంబరాలు చేసుకుంటున్నారని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 

ఇదిలా ఉండగా విజయవాడలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు. ముందుగా విశాఖలో వేడుకలు నిర్వహించాలనుకున్నప్పటికీ విజయవాడలో జరిపేందుకు నిర్యహించినట్టు చెప్పారు. ఆ మేరకు విశాఖ నుంచి విజయవాడకు మారుస్తూ ఆదేశాలు జారీ చేసినట్టుగా పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: