ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా ?, అందుకే పొద్దుపోయాక  కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారా ?? అంటే అవుననే రాజకీయ పరిశీలకులు అంటున్నారు . శాసన మండలిలో టీడీపీకి ఆధిక్యం ఉండడంతో , ప్రతిసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిల్లులను అడ్డుకుంటుందనే ఆగ్రహం తో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది . ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యం కోసం ఇటీవల  ప్రవేశపెట్టిన బిల్లును అడ్డుకున్న టీడీపీ సభ్యులు , ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ బిల్లును కూడా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు . దీనితో మండలి రద్దు చేయాలని భావిస్తోన్న జగన్ , రాత్రి పొద్దుపోయాక కేబినెట్ భేటీని ఏర్పాటు చేశారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి .

 

కేబినెట్ భేటీలో అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మానం  చేసి, బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించగానే పార్లమెంట్ కు నివేదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది . పార్లమెంట్ ఒకే చెప్పేయడం ... రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ తో , ఏపీ శాసనమండలి కథ కంచికి చేరే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు . ఏపీ లో జగన్ సర్కార్ కొలువుతీరిన వెంటనే మండలిని రద్దు చేయాలన్న ఆలోచన చేసినట్లు ..అయితే పెద్దల సభ పై  తనకున్న గౌరవం కారణంగానే ఇన్నాళ్లు జగన్ రద్దు చేసేందుకు కాసింత వెనుకాముందు ఆడినట్లు తెలుస్తోంది . అయితే తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన   పరిపాలన వికేంద్రీకరణబిల్లుకు  టీడీపీ సభ్యులు అడ్డుపడడం ... ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం .

 

 అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే మండలి రద్దు ముసాయిదా బిల్లు రెడీ చేసి ఉంచినట్లు తెలుస్తోంది . మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు  టీడీపీ సభ్యులు ఏమాత్రం అడ్డు తగిలి , గందరగోళం సృష్టించిన మండలిని రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం . తాజాగా  మండలిలో టీడీపీ సభ్యుల వ్యవహారశైలి చూసిన జగన్ , రాత్రికి రాత్రే కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి , మండలి రద్దు నిర్ణయం తీసుకోనున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: