పరిపాలన వికేంద్రీకరణ కోసం ఆంధ్ర ప్రదేశ్ లో మూడు  రాజధానులను ఏర్పాటు చేయాలన్న   జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హన్మంతరావు విస్మయం వ్యక్తం చేశారు . మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం  హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు . దేశంలో ఎక్కడ కూడా మూడు  రాజధానుల విధానం లేదన్న ఆయన , మూడు  రాజధానుల విధానం తాను  ఎక్కడా వినలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు .

 

ఏపీ స్పెషల్ స్టేటస్ కే నిధులు లేవని  .. ఇక అటువంటప్పుడు  మూడు రాజధానుల అభివృద్ధికి నిధులు ఎలా వస్తాయని వి .హన్మంతరావు ప్రశ్నించారు . ఏపీ లో జరుగుతున్న రాజధాని రగడ పై కేంద్రంలోని బిజెపి సర్కార్ తక్షమే  స్పందించాలని డిమాండ్ చేశారు . కేసీఆర్ సలహాతో జగన్ మూడు  రాజధానుల   ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారని విహెచ్ అభిప్రాయపడ్డారు . మూడు రాజధానుల ప్రతిపాదనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం , రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు . మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే , మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు .

 

గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కి , విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేసిందన్న వైకాపా ప్రభుత్వం , రాజధానిగా  విశాఖ వైపే కమిటీ మొగ్గు చూపిన విషయాన్ని గుర్తు చేశారు . అయితే మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనను అమరావతి ప్రాంత రైతులు , ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు , నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెల్సిందే . రాజధాని ప్రాంత రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్న జగన్ సర్కార్ , అసెంబ్లీ వేదిక  హామీ ఇచ్చింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: