ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నూతన పురపాలికల్లో పాగా వేసేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది . నల్గొండ, భువనగిరి యాదాద్రి , సూర్యాపేట జిల్లాల పరిధిలో పలు పట్టణాలను నూతన పురపాలికలుగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే  . ఈ పురపాలికల పాలకవర్గాల ఏర్పాటు కోసం  బుధవారం నాడు జరిగే పోలింగ్ లో  ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు . అయితే నూతన పురపాలికల ఓటర్ల మనోగతం పరిశీలిస్తే అధికార టీఆరెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు కన్పిస్తోంది .

 

మరో నాలుగేళ్లపాటు రాష్ట్రం లో టీఆరెస్ పార్టీ అధికారంలో కొనసాగనున్న నేపధ్యం లో ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకుంటే   అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు  భావిస్తున్నారు .    పట్టణాలు అభివృద్ధి చెందాలంటే ముందుగా మౌలిక వసతుల కల్పన జరగాలని అంటున్న నూతన పురపాలికల ఓటర్లు ...   మౌలిక వసతులు కల్పించాలంటే అధికారం లో ఉన్న  పార్టీలకే  సాధ్యమని అంటున్నారు . అందుకే నూతన పురపాలికల  ఓటర్లు , అధికార  టీఆరెస్ అభ్యర్థులకు ఓటు వేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు . గతం లో మేజర్ గ్రామపంచాయితీలుగా కొనసాగిన పట్టణాలను , మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందగా   ఇప్పటికి సరైన మౌలిక వసతులు లేకపోవడంతో , స్థానికులు మౌలిక వసతుల కల్పన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు .

 

నూతనంగా ఏర్పడే పాలకవర్గాల ఆధ్వర్యం  లోనే మౌలిక వసతుల కల్పన సాధ్యమని భావిస్తోన్న పట్టణప్రాంత ఓటర్లు , అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే  వారు  అధిక నిధులను తీసుకువచ్చి అభివృద్ధి పనులను చేపడుతారని భావించడం , విపక్షాలకు శరాఘాతమనే చెప్పాలి . విపక్ష పార్టీలకు చెందిన నేతలు గెలిచి  ఎంతగా  అభివృద్ధి  చేయాలనుకున్న అధికారపార్టీ నేతలు సహకరించే అవకాశం లేకపోవడంతో ... పట్టణాలు అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడమే బెటరన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: