పురపాలక ఎన్నికల సమరం మొదలైంది.  కొద్దీ సేపటి క్రితమే ఎన్నికలు హడావుడి మొదలైంది.  రాష్ట్రంలోని 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి.  ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరు తమ శక్తికి మించి ప్రచారం నిర్వహించుకున్నారు.  ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేశారు.  ఎలాగైనా మేజర్ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకోవాలని అధికార తెరాస పార్టీ ప్రయత్నం చేస్తున్నది.  


దానికి తగ్గట్టుగానే ప్రచారం చేసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది తెరాస పార్టీ.  సాధ్యమైనంత వరకు ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.  అయితే, విజయం ఎలా ఉంటుంది అన్నది తెలియాలంటే మాత్రం ఈనెల 25 వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.  ఇక ఇదిలా ఉంటె, ఎన్నికల్లో విజయం కోసం అటు కాంగ్రెస్ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది.  


నాయకులంతా ప్రచారం నిర్వహించారు.  ఎన్నికల్లో విజయం కోసం తమ శక్తివంచన  లేకుండా కష్టపడుతున్నారు.  మరి ఎలా విజయం సాధిస్తారు అన్నది చూడాలి.  ఈ ఎన్నికల్లో కొంతవరకు పట్టును సాధిస్తే దానిద్వారా అధికార పార్టీకి తమ శక్తిని చూపించాలని అనుకుంటున్నారు.  ఈ శక్తి మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రతాపం చూపించవచ్చు.  ఇక ఇదిలా ఉంటె, పురపాలక ఎన్నికలు అన్నవి ఆయా పార్టీలకు చాలా కీలకం అని చెప్పాలి.  అసెంబ్లీ ఎన్నికల వరకు బలపడేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడతాయి.  


మరోవైపు బీజేపీ కూడా కొన్ని ప్రాంతాలను గెలుచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నది.  ఎంపీగా గెలిచిన ప్రాంతాల్లో ఎలాగైనా సరే అక్కడి మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు గెలుచుకోవాలని బీజేపీ రెడీ అవుతున్నది.  దానికి తగ్గట్టుగానే ప్రచారం నిర్వహించింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో కూడా అలాంటి విజయమే సాధిస్తుందా లేదంటే చతికిల పడుతుందా అన్నది మరికాసేపట్లోనే తేలిపోతుంది.  చూద్దాం ఏం జరుగుతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: