తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఉన్నంత కాలం రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది.  రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవాలని చూస్తున్నా, తెలుగుదేశం పేరిట అడుగడుగా అడ్డుపడుతూ, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.  మూడు రాజధానుల అంశాన్ని ప్రతి ఒక్కరు ఆమోదిస్తున్నారని, కానీ, తెలుగుదేశం పార్టీ ఒక్కటే అడ్డుపడుతున్నట్టు వైకాపా చెప్తున్నది.  


అభివృద్ధి అంటే ఏ ఒక్కచోట ఉంటె సరిపోదని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అని లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని వైకాపా నేతలు అంటున్నారు. అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ మాత్రమే అడ్డుపడుతోందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.  గతంలో అభివృద్ధి మొత్తం ఒకే ప్రాంతానికి చెంది ఉండటంతోనే ఈ ఇబ్బందులు తలెత్తాయని, ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే తప్పకుండా అన్నింటికీ అనుకూలంగా ఉండేలా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.  


కానీ, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా సహకరించాలని, ఇలా అడ్డు పడకూడదు అని అంటున్నారు. ఎవరికి వారు ఇలా అడ్డుపడుతూ ఉంటె ఇక  రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందుతాయని, అభివృద్ధికి దూరంగా ఉండిపోతారని చెప్తున్నారు.  తెలుగుదేశం పార్టీ సర్కస్ ఫీట్లు మాని నెలకు దిగి వచ్చి వాస్తవాలు గుర్తించాలని వైకాపా నేతలు చెప్తున్నారు.  


ఈరోజు కూడా అసెంబ్లీలో మూడు రాజధానుల విషయంపై చర్చ జరుగుతున్నది.  నిన్నటి రోజున అసెంబ్లీలో ఈ బిల్లుపైన చర్చ జరగకుండానే వాయిదా పడింది.  రూల్ నెంబర్ 71 ను వినియోగించుకున్న తెలుగుదేశం పార్టీ, మంత్రులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.  ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడం కోసం ప్రవేశపెట్టిన రూల్ నెంబర్ 71 ద్వారా బిల్లును అడ్డుకున్నాయి.  కాగా, ఈరోజు కూడా దీనిపై చర్చ జరగబోతున్నది.  మరి ఏం జరుగుతుందో చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: