తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు జరుగుతున్నాయి.  ప్రస్తుతానికి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.  కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారిపోయాయి.  మూడు రాజధానుల కోసం ప్రవేశపెట్టిన బిల్లుపై నిన్నటి రోజున శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకున్నది.  దీంతో ఈ బిల్లుపై మరలా అసెంబ్లీలో చర్చ ప్రారంభం అయ్యింది.  


అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న తెలుగుదేశం పేరిట ఎమ్మెల్సీలను పోలీస్లు అడ్డుకున్నారు.  దీంతో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి.  ఎమ్మెల్సీలను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తే... వాహనానికి స్టిక్కర్ ఉండాలని చెప్పడం విశేషం.  స్టిక్కర్ ఉండాల్సిన అవసరం లేదని, తమ దగ్గర తాము ఎమ్మెల్సీ అని చెప్పడానికి కావాల్సిన డాకుమెంట్స్ ఉన్నాయని చెప్పడంతో వారిని వదిలిపెట్టారు.  


అమరావతిలో అసలేం జరుగుతుందో అర్ధం కావడం లేదు.  రెండు పార్టీలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నాయి.  ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ప్రజలు ఓటు వేస్తె, ఈ కొట్టుకోవడం కుమ్ములాటలు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  ఎందుకు ఇంతగా గొడవలు చేసుకుంటున్నారో తెలియడం లేదు. ఇది ఇలానే కొనసాగితే, భవిష్యత్తులో ఇంకా ఇబ్బందులు వస్తాయని, దాని వలన ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అంటున్నారు.  


ఇక ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పోలీసులను నిలదీసింది.  దేశంలో ఏ సీఎం ఇంటి వద్ద  అయినా 144 సెక్షన్‌ ఉందా అని ప్రశ్నించారు. సీఎం డమ్మీ కాన్వాయ్‌లో వెళ్ల వచ్చా అని నిలదీశారు.   మహిళలపై జరుగుతున్న దాడులపై నిలదీస్తే వైకాపా సభ్యులు ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు.  అమరావతి రాజధానికి రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు అంగీకరించారని, ఇప్పుడు ప్రభుత్వం బలవంతగా అక్కడినుంచి తరలించడం సరికాదని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. మహిళా సభ్యురాలిపట్ల నిన్న మంత్రుల ప్రవర్తన బాధాకరమన్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా టీవీ ప్రసారాలు నిలిపివేసి, ఎస్టీ మహిళపై విరుచుకుపడ్డారని ఎమ్మెల్సీ ఆరోపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: