కమ్మ కులం అంటే తెలుగుదేశం పార్టీకి పేటెంటు హక్కు ఏమీ లేదని అసెంబ్లీలో వైసీపీ అబ్బయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్మ కులమంతా తమ గంప సొత్తుగా చంద్రబాబు, తెలుగు దేశం పార్టీ భావించడం సిగ్గు చేటు అంటూ అబ్బయ్య చౌదరి అన్నారు. కమ్మ కులంలో చాలా మంది వైసీపీ అభిమానులున్నారని ఆయన అన్నారు. అందుకు తమ కుటుంబమే ఉదాహరణగా అబ్బయ్య చౌదరి చూపించారు.

 

తాము, తమ తండ్రి అంతా 1985 నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డినే తమ నాయకుడిగా భావించామన్నారు. కులాన్ని సంకుచితత్వం కోసం.. తన స్వార్థం కోసం వాడుకునే దిక్కుమాలిన అలవాటు కేవలం చంద్రబాబుకే ఉందని అబ్బయ్య చౌదరి విమర్శించారు. జగన్ సర్కారు కుల, మతాలకు అతీతంగా అందరికీ పథకాలు అందిస్తుందని గుర్తు చేసారు.

 

జగన్ సర్కారు అన్ని కులాలను సమానంగా చూస్తోందని.. కమ్మ కులస్తుల కోసం త్వరలో జగన్ కమ్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారన్న విషయాన్ని అబ్బయ్య చౌదరి తెలిపారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా కొన్ని కులాలకు కార్పొరేషన్ లు ఏర్పాటు చేశారు.

 

వాటిలో బ్రహ్మణ కార్పోరేషన్, కాపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే అగ్ర కులాలుగా పేరుబడిన కమ్మ, రెడ్డి కులాలకు కార్పోరేషన్ లు మాత్రం ఏర్పాటు చేయలేదు. కానీ జగన్ సర్కారు కమ్మ కులంలోని పేద వారి కోసం ఈ కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారని అబ్బయ్య చౌదరి తెలిపారు.

 

ఇప్పటికే కమ్మ కులస్తులైన కొడాలి నాని జగన్ కు అసెంబ్లీలో అండగా ఉంటున్నారు. ఆయన మంత్రి వర్గంలో కూడా స్థానం దక్కించుకున్నారు. ఇక ఎన్నికల తర్వాత వల్లభనేని వంశీ కూడా జగన్ కు జై కొట్టారు. వైసీపీలోనూ కమ్మ కులానికి ప్రాధాన్యం లభిస్తోంది. ఈ నేపథ్యంలో కమ్మ కులంపై టీడీపీకి పేటెంటు లేదన్న వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: