నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా జనసేన పార్టీని ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ ఇప్పుడు కాడి మొత్తం కిందపడేసి కాషాయ జెండా కప్పేసుకున్నాడు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అని చెబుతూ అప్పట్లో టిడిపి ప్రభుత్వం ఏ ప్రశ్నలు వేయకుండా... ప్రతిపక్షాల మీద ప్రశ్నలు వేస్తూ అనుమానాస్పదంగా పవన్ మిగిలిపోయాడు. దీని వల్ల పవన్ రాజకీయంగా చాలా నష్టపోయాడు. ఎన్నికల్లో కేవలం ఒక్క చోట తప్ప మిగతా అన్ని చోట్లా జనసేన అభ్యర్థులు ఓడిపోవడమే కాకుండా స్వయంగా తాను పోటీ చేసిన రెండు చోట్ల ఘోర ఓటమి చవి చూశాడు పవన్.


 వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక అంశం తో జనాల్లో ఉంటూ తన పలుకుబడి పెంచుకునే దిశగా అడుగులు వేస్తూ వచ్చారు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా పవన్ సొంతంగా ఎదగాలనే తన నిర్ణయానికి తానే తూట్లు పొడుచుకున్నాడు. గతంలో మత తత్వ పార్టీ అంటూ  బీజేపీ విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ రాజకీయాల్లో ఏదో చేసేస్తాను... సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా జనసేన పార్టీని తీర్చిదిద్దుతాను అని చెబుతూ ఆవేశంతో ఊగిపోతూ ఉండేవారు. 


అమరావతి ప్రాంతంలో  పోలీసులు తనను నిర్బంధించిన తీరును తప్పుపడుతూ ఆగ్రహంగా మాట్లాడారు. ఇక బీజేపీ అమరావతి విషయంలో ఇప్పటికీ రెండురకాల ధోరణులతో ముందుకు వెళ్తోంది.  ఏపీ బీజేపీ అమరావతిని వ్యతిరేకిస్తుంది. కేంద్రం మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో పవన్ అమరావతి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయంలో క్లారిటీ లేకుండా ఉండిపోయారు. ఈరోజు జరిగే బిజెపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో తగిన నిర్ణయం తీసుకోబోతున్నారు.


 తర్వాత పవన్ అమరావతి విషయంలో ఏం చేయబోతున్నారు అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పవన్ పూర్తిగా బీజేపీ కంట్రోల్ లోకి వెళ్ళిపోయాడు అనే విషయం అర్థమవుతోంది. అమరావతి పై బిజెపి కనుక జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తే పవన్ కూడా అన్ని ఇగోలను పక్కన పెట్టి అమరావతికి మద్దతు గా మాట్లాడే పరిస్థితి వస్తుంది. అదే కనుక జరిగితే పవన్ మరింతగా అభాసుపాలవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: