రాజ‌కీయాల‌కు, వ్య‌క్తిగ‌త ఆస‌క్త‌కుల‌కు సంబంధం ఏముంటుంది చెప్పండి? అందుకే, రాజ‌కీయాల‌కు అతీతంగా స‌మాజానికి మేలు చేసే విష‌యంలో ఇద్ద‌రు ప్ర‌ముఖులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అందులో ఒక‌రు వైసీపీ ఎంపీ, ఇటీవ‌లి కాలంలో వార్త‌ల్లో నిలుస్తున్న వ్య‌క్తి అయితే, మ‌రొక‌రు టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకు స‌న్నిహితుడ‌నే పేరున్న వ్య‌క్తి. ఆయ‌న కూడా ఇటీవ‌లే ఊహించ‌ని రీతిలో వార్త‌ల్లో నిలుస్తున్న వ్య‌క్తి. ఆ ఇద్ద‌రే నరసాపురం ఎంపీ రఘు రామ‌కృష్ణంరాజు, సినీ నిర్మాత అశ్విన్ దత్‌.

 

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ఒక మొక్క నాటి...మ‌రో ముగ్గురికి మొక్క‌లు నాటి సంర‌క్షించాల‌నే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ‌దిన కుమారుడు, ఎంపీ సంతోష్‌కుమార్ `గ్రీన్ చాలెంజ్‌`ను ప్రారంభించారు. ఇందులో భాగంగా, ఇటీవ‌ల నరసాపురం ఎంపీ రఘు రామ‌కృష్ణంరాజు మొక్క‌లు నాటి... అశ్విన్‌ద‌త్‌కు చాలెంజ్ విసిరారు. వైసీపీ ఎంపీ చాలెంజ్‌ను స్వీక‌రించిన సినీ నిర్మాత అశ్విన్‌దత్‌ స్వీకరించి గచ్చిబౌలిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. అశ్విన్‌ద‌త్‌తో  పాటుగా అయిన కుమార్తె ప్రియాంక దత్త, మనవడు రిషి కార్తికేయ కలిసి మొక్కలు నాటారు.

 

ఈ సంద‌ర్భంగా సినీ నిర్మాత అశ్విన్ దత్ మాట్లాడుతూ, జ‌బ్బులకు, కాలుష్యానికి దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చెట్లు పెంచాలన్నారు. ఇలాంటి కార్యక్రమన్ని ప్రారంభించిన ఎంపీ సంతొష్ కుమార్ ని అభినందిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను హీరోలు నాని, విజయ్ దేవరకొండ, దర్శకుడు కె.రాఘవేంద్రా రావు,కాకినాడ పోర్ట్ చైర్మన్ కేవీ రావు, డాక్టర్ జయంతిలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నానని అన్నారు. అశ్వనీ ద‌త్ కుమార్తె ప్రియాంక దత్ మాట్లాడుతూ వాతావరణ మార్పులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయ‌న్నారు. 50 డిగ్రీలకు దగ్గరలో ఉష్ణగ్రతలు నమోదు అవుతుండ‌టం బాధాక‌ర‌మ‌న్నారు. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నార‌ని ప్ర‌శంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: