ఎంత కాదనుకున్న ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక్కగానొక్క గారాల పుత్రుడు కావడంతో ఏపీ రాజకీయాల్లో ఆయన ప్రస్తావన లేకుండా రాజకీయాలు నడవడంలేదు. 
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత లోకేష్ ఎప్పటికైనా ఆ స్థానంలో కూర్చుంటాడనే విషయం అందరికి తెలుసు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను సైతం చంద్రబాబు పక్కనపెట్టి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టారు. ఈ సమయంలో తనను తాను సమర్ధుడైన నాయకుడుగా  నిరూపించుకోవాల్సిన అవసరం లోకేష్ కు ఉంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్షం అని తేడా లేకుండా అందరూ లోకేషన్ అసమర్థ నాయకుడిగా చూస్తున్నారు.


 ఈ విషయం చంద్రబాబు వరకు వెళ్తున్నా ఇది నిజమే కదా అన్నట్టుగా  ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. వయస్సు రీత్యా చూస్తే చంద్రబాబు కు బాగా టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సమర్థవంతంగా ముందుకు నడిపించకపోతే   భవిష్యత్తులోనూ మనుగడ కోసం పాకులాడే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉన్నా ఆ చక్కటి అవకాశాన్ని తన చేతులారా  పాడు చేసుకుంటున్నాడు. అమరావతి పోరాటంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ చంద్రబాబు తన వయస్సుకు మించి కష్టపడుతున్నాడు. రాష్ట్రమంతా తిరుగుతూ అమరావతి జరిగే నష్టం వివరిస్తూ పార్టీ ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 


ఈ సమయంలో లోకేష్ ఇంటికే పరిమితం కాకుండా చంద్రబాబు కంటే మరింత స్పీడ్ గా రాష్ట్ర పర్యటన చేస్తూ, అమరావతి ప్రాంత ప్రజలకు భరోసా కల్పించేలా వ్యవహరిస్తే పార్టీ శ్రేణులు ఒక బలమైన నమ్మకం ఏర్పడి ఉండేది. అదే సమయంలో లోకేష్ బలమైన నాయకుడు అనే విషయం అందరికి అర్ధం అయ్యేది. కానీ లోకేష్ మాత్రం అలా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తాను అసమర్దుడిని అనే విషయాన్ని అందరికి అర్ధమయ్యేలా చెప్పుకుంటున్నాడు. ఇప్పటికీ లోకేష్ తన వ్యవహారశైలి మార్చుకోకపోతే ముందు ముందు చాలా కష్టాలనే ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: