ఇద్దరు భార్యలున్న దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు.  ఇద్దరు భార్యలతో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో పురాణాల్లో చదువుకున్నాం.  సినిమాల్లో చూశాం.  సినిమా అంటే గుర్తుకు వచ్చింది.  ఇద్దరు భార్యలున్న సినిమా ఏవండీ ఆవిడ వచ్చింది ఎలా ఉంటుందో తెలిసిందే.  ఈ సినిమాలో శోభన్ బాబుకు ఇద్దరు భార్యలు ఉంటారు.  తండ్రి తన తరఫువారి నుంచి ఒకరిని, తల్లి తన తరుపువారి నుంచి మరొకరిని ఇచ్చి వివాహం చేస్తారు.  ఇద్దరు భార్యల మధ్యన ఎంతగా వేగిపోతాడో సినిమాలు వ్యంగంగా చూపించారు.  


ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా ప్రేక్షకులను రంజింపజేశారు.  ఇలాంటి సంఘటన నిజజీవితంలో జరిగితే ఇంకేమైనా ఉన్నదా.. ఆ భర్త ఎన్ని ఇబ్బందులు పడతారో చెప్పక్కర్లేదు.  నిజంగానే ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.  ఝార్ఖండ్ లో ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలతో మొదట్లో ఎలానో మ్యానేజ్ చేశాడు.  కానీ, కొంతకాలం తరువాత మ్యానేజ్ చేయలేకపోయారు.  చిన్నభార్య దగ్గర ఎక్కువ సమయం గడుపుతుండటంతో పెద్ద భార్యకు కోపం వచ్చింది.  


వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది.  ఇది భార్య భర్తల సమస్య కావడంతో కేసు నమోదు చేసుకోకుండా పరిష్కారం చెప్పేందుకు ప్రయత్నం చేశారు.  చిన్న భార్య దగ్గరే ఎక్కువగా ఉండకుండా పెద్ద భార్య దగ్గర కూడా ఉండాలని పోలీసులు చెప్పారు.  దీంతో మొదటిభార్య దగ్గర ఎక్కువ సమయం ఉండటం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి.  


కొన్ని రోజుల తరువాత చిన్నభార్య వచ్చి కంప్లైంట్ చేసింది.  పెద్దావిడ దగ్గరే ఎక్కువ సమయం ఉంటున్నాడని చెప్పడంతో వాళ్ళను కూడా పోలీసులు పిలిపించారు.  అందరు కలిసి పంచాయితీ పెట్టారు.  ఇద్దరు భార్యలు కొట్టుకున్నంత పని చేశారు.  ఎలాగైతేనేం చివరికి పెద్ద మనుషుల లెక్కన పోలీసులు తీర్పు చెప్పారు.  ఇద్దరు భార్యల దగ్గర మూడు మూడు రోజుల చొప్పున ఉండాలని, సోమవారం నుంచి శనివారం వరకు అలా ఉండొచ్చని చేప్పారు.  ఆదివారం ఇష్టం వచ్చిన వాళ్ళ వద్ద ఉండొచ్చని చెప్పారు.  దీంతో ఈ సమస్య ప్రస్తుతానికి పరిష్కారం అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: