జగన్ ఎంత మొండి వాడో  అంతకంటే ఎక్కువ తెలివైనవాడు. తాను మాట్లాడే మాటలు... ఇచ్చే హామీలు ఊరికే ఆషామాషీగా, నెరవేరని హామీలు గా ఉండిపోకుండా ఖచ్చితంగా ఏదైతే తాను అమలుచేసి తీరగలనో ముందుగానే సరి చూసుకుని అప్పుడు ఆ విషయం పై జగన్ స్పందిస్తూ హామీలు ఇస్తూ ఉంటారు. ఒకవేళ మాట ఇచ్చిన తర్వాత అది కష్టసాధ్యమైన వ్యవహారం అని తేలినా జగన్ మాత్రం వెనకడుగు వేసేందుకు ఇష్టపడరు. మొదటి నుంచి జగన్ నైజమే అంత. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడానికి కూడా ఒకరకంగా ఇటువంటి పరిణామాలే కారణం. 


జగన్ అధికారంలోకి రాకముందు రాష్ట్రమంతా కాలినడకనపాదయాత్ర చేపట్టిన జగన్ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను స్వయంగా చూసి, అడిగి తెలుసుకున్నారు. ఆ పాదయాత్ర సమయంలో ప్రజలకు ఏది చేస్తే మంచి జరుగుతుంది అనే విషయాన్ని క్లారిటీగా తెలుసుకున్నారు. పాదయాత్ర సమయంలో తాను ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి రాకముందే సమగ్రంగా నిపుణులతో చర్చించారు. ఎన్నికల మేనిఫెస్టోలో వాటిని పెట్టడమే కాకుండా, అధికారంలోకి రాగానే వాటిని చక్కగా అమలు చేసి చూపించారు. ఇక రాజధాని వ్యవహారంలోనూ జగన్ ప్రభుత్వం పై విమర్శలు వచ్చినా ఆయన వెనక్కి తగ్గడంలేదు.


 అమరావతిలో భారీ బడ్జెట్ తో ఇప్పటికిప్పుడు నిర్మాణాలు మొదలుపెట్టినా అవి పూర్తయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుందని, అది కాకుండా లక్ష కోట్లు బడ్జెట్ వీటికి కేటాయించాలని అది ఏపీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చాలా భారమని భావించే మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే తలంపుతో విశాఖ, కర్నూలు లో కూడా రాజధానిని ఎంపిక చేసుకున్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా జగన్ వాటిని ఏమాత్రం లెక్క చేయడం లేదు.


 తాను ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని ఈ సమయంలో దుష్టశక్తులు అడ్డుపడినా లెక్క చేయను అనే విధంగా జగన్ మొండిగా ముందుకు వెళుతున్నాడు. ఇదే భయం ప్రతిపక్షాలకు భయాన్ని కలిగిస్తోంది. తాము ఎంతగానో పోరాటం చేసినా జగన్ వెనక్కి తగ్గరు కాబట్టి మూడు రాజధానుల ఏర్పాటు  జరిగిపోతాయని, తర్వాత మనం కూడా మూడు రాజధానులు జై కొట్టాల్సి వస్తుందని, దీని ద్వారా అమరావతి తప్ప మిగతా ప్రాంతాలలో ప్రజల నుంచి తమ పార్టీలపై వ్యతిరేక భావన పెరుగుతుందని వారు భయపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: