సినిమాల్లో పవర్ స్టార్ గా ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ జన సేవ చేయాలని జనసేన పార్టీని స్థాపించి జనాల్లోకి వెళ్లారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ  అధికార పార్టీ తీరును ఎండగడుతూ దూసుకుపోయారు. మొదట 2014 ఎన్నికల్లో టిడిపి పార్టీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ 2019 లో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక రేంజిలో రాజకీయాలను ప్రభావితం చేస్తారని అందరూ అనుకున్నప్పటికీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయి ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలని వదిలి సినిమాల్లోకి వెళ్లడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన జీవితం మొత్తం జనసేవ కి అంకితం.. సినిమాల్లోకి వెళ్ళను అంటూ ఎన్నో సార్లు బల్ల గుద్ది మరీ చెప్పారు. 

 

 

 కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ హిట్ మూవీస్ పింక్ రీమేక్  తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే షూటింగ్ షూటింగ్ మొదలవగా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు  కూడా. పింక్ సినిమాతో పాటు మరో సినిమాను కూడా పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు అని టాక్ వినిపిస్తోంది. జనవరి 27న పవన్ కళ్యాణ్ రెండో చిత్రం కూడా మొదలు కానుందని ఇందులో బందిపోటు టైగర్ నాగేశ్వరరావు పాత్రలో  పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారని... ఈ  సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ టాలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా  అసలు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సమయం మాత్రం రాంగ్  అంటున్నారు అందరూ. 

 

 

 తన జీవితం మొత్తం రాజకీయాలకే  అని చెప్పిన పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం... ఈ సమయంలోనే బీజేపీతో పొత్తు పెట్టుకోవటం అందరిలో ఎన్నో ప్రశ్నలకు తావిస్తున్నాయి.కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండి అది కూడా పవన్ కళ్యాణ్ మాట వినకుండా ఉన్న ఎమ్మెల్యేలతో 151 మంది ఉన్న జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా అంటూ డైలాగులు చెబుతూ ఉండటం... ఢిల్లీకి వెళ్తా అంటూ డైలాగులు చెప్పి  సినిమాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ పై కొంత మంది ప్రత్యక్షంగా అనే విమర్శలు చేస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర మొత్తం అట్టుడికి పోతుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు  సినిమాలు కావాల్సి  వచ్చాయా అంటూ విమర్శిస్తున్నారు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: