ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది . ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు . పట్టణ ప్రాంత ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం తో , చౌటుప్పల్ లో ఏకంగా 93 .31 శాతం మంది  ఓటింగ్ శాతం నమోదయింది . చౌటుప్పల్ తో పాటు చండూరు , చిట్యాల మున్సిపాలిటీల్లో ఓటర్లు బారులు తిరి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడ్డారు .

 

పలు మున్సిపాలిటీల్లో ఓటింగ్ సందర్బంగా చెదురు, ముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి . పలు చోట్ల ఓటర్లను ప్రభావితం చేసేందుకు వివిధ పక్షానాయకులు డబ్బులు పంచే ప్రయత్నం చేయగా , ఇతర పార్టీల నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు . అయితే ఈ సందర్బంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణాత్మక   వైఖరి చోటు చేసుకుంది . ఉమ్మడి నల్గొండ జిల్లాలో వివిధ మున్సిపాలిటీల్లో దాదాపు 80 శాతానికిపైగా పోలింగ్ శాతం నమోదు  కావడం తో అధికార , ప్రతిపక్ష పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి  . అధికార పార్టీ తీరుపై విసిగిపోయిన ఓటర్లు భారీగా తరలించి ఓటింగ్ లో పాల్గొన్నారని విపక్ష నేతలు చెబుతుండగా , ప్రభుత్వ చేపడుతున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలను చూసి ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చేందుకు ఓటింగ్ లో పాల్గొనేందుకు బారులు తీరారని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు   . అయితే ఎన్నికల అనంతరం ఎవరికీ వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు .

 

 ఓటర్లు మాత్రం ఇప్పటికే  తమ ఓట్లను బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తం చేశారు .  ఈ నెల 25 వతేదీన ఫలితాలు వెలువడనున్నాయి . దీనితో అభ్యర్థుల  గెలుపుపై ఇప్పటికే పందాలు కొనసాగుతున్నాయి . మున్సిపల్ పాలకవర్గానికి జరిగిన ఈ ఎన్నికల్లో పార్టీలకతీతంగా పలువురు అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసే అవకాశాలు లేకపోలేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: