కొంతమంది దర్శకులతో సినిమాలు చేయడం అంటే చాలామందికి చాల ఇష్టంగా ఉంటాయి.  దర్శకుల్లో ఇలాంటి దర్శకులు వేరయా అంటారు.  అలాంటి దర్శకుల్లో ఒకరు గౌతమ్ మీనన్.  ఈయన సినిమాలు చాలా విచిత్రంగా ఉంటాయి.  కొన్ని అంశాలను తీసుకొని దాని చుట్టూ అందమైన ప్రేమకథను అల్లుకొని సినిమాలు తీస్తుంటారు.  సినిమాలో ఏముంది అంటే మన ప్రేమ ఉన్నది అని ప్రేక్షకులు ఫీల్ అవుతుంటారు.  అంతటి ఫీల్ తో సినిమాలు చేయించగలిగిన దిట్ట గౌతమ్ వాసుదేవ్ మీనన్.  అయన తీసిన ఏం మాయ చేశావే సినిమా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  


మాస్ హీరో అవుదామని అనుకున్న చైతూకు రెండో సినిమాతో మంచి ప్రేమకథ చిత్రాన్ని అందించి లవర్ బాయ్ గా చేశారు.  అప్పటి నుంచి చైతు లవ్ సినిమాల్లోనే ఎక్కువగా హిట్ అవుతున్నాడు.  మాస్ హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నా సక్సెస్ కాలేకపోతున్నారు.  ఆ తరువాత గౌతమ్ వాసు దేవ్ మీనన్ చరణ్ తో సినిమా చేయాలని అనుకున్నాడు.  చరణ్ కు కథ చెప్పాడు.  ఆ కథకు చరణ్ నిజంగా ఫ్లాట్ అయ్యాడు. 


తప్పకుండా చేయాలని అనుకున్నాడు.  కానీ డేట్స్ సర్దుబాటు కాలేదు.  దీంతో చరణ్సినిమా చేయలేకపోయాడు.  అదే సమయంలో గౌతమ్ హీరో నానిని కలిసి కథ చెప్పడంతో వెంటనే ఒకే చేశాడు.  ఆ వెంటనే సినిమా స్టార్ట్ అయ్యింది.  సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.  ఈ సినిమాలోని సాంగ్ ప్రియతమా నీవచట కుశలమా అనే సాంగ్ ఎప్పటికి ఎవర్ గ్రీన్ హిట్ గా ఉంది అంటే అర్ధం చేసుకోవచ్చు.  సమంత మరోసారి ఈ సినిమాతో మాయ చేసింది.

 
దీనిపై చరణ్ ఓ సందర్భంలో స్పందించారు. నేను చేయాల్సిన ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమాను నాని కొట్టేశాడని చెప్పాడు.  ఫన్నీగానే చెప్పాడు.  కానీ, ఆ సినిమా చరణ్ చేసి ఉంటె మరోలా ఉండేది.  చరణ్ ప్యూర్ లవ్ సినిమాలు ఇప్పటి వరకు చేయలేదు.  దాదాపుగా అన్ని మాస్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ ఉండిపోయాడు.  గౌతమ్ మరోసారి చరణ్ తో ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా.  చూద్దాం ఏం చేస్తారో.  

మరింత సమాచారం తెలుసుకోండి: