అమరావతి కోసం ఉద్యమం జరిగింది.  ఈ ఉద్యమంలో అమరావతి గ్రామాల్లోని ప్రజలు మాత్రమే కదిలారని, మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కదల్లేదని కొంతమంది వాదన.  ఇందులో ఎంత వరకు నిజం ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం. అమరావతిని 29 గ్రామాల మధ్యలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ 29 గ్రామాల్లోని భూములను అప్పటి ప్రభుత్వం సేకరించింది.  ఈ సేకరణలో భాగంగానే తెలుగుదేశం పార్టీ రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా, వారికీ కమర్షియల్ ల్యాండ్ ను ఇస్తామని చెప్పింది.  


అమరావతిని రాజధానిగా చేశారు కాబట్టి భవిష్యత్తులో ప్రజలు అమరావతికి వస్తారు కాబట్టి అక్కడ డెవలప్ జరుగుతుంది.  పది 20 ఏళ్లలో దాదాపుగా లక్షలాది మంది ప్రజలు అమరావతి వస్తారు అనే ఉద్దేశ్యంతోనే అక్కడి రైతులు భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే, ఇప్పటి ప్రభుత్వం అక్కడి నుంచి కార్యనిర్వాహక రాజధానిని మార్చాలని నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే బిల్లును శాసనసభలో పాస్ చేయించుకుంది.  కానీ, మండలిలో ప్రభుత్వానికి బలం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నది.  


మండలిలో బిల్లు పాస్ కాకపోవడంతో పాటుగా బాబుగారు తెలివిగా ప్లాన్ చేయడంతో బిల్లును తిరస్కరించకుండా, ఓటింగ్ జరపకుండా సెలక్ట్ కమిటీకి పంపించారు.  బాబు మాస్టర్ తెలివితేటలను ఇలా వినియోగించుకున్నారు.  అయితే, అమరావతి ఉద్యమంలో 29 గ్రామాల ప్రజలే ఎక్కువుగా పాల్గొన్నారు.  ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తం కాలేదు. రాజధాని అంశమే అయినప్పటికీ ఆ 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అయ్యింది.  


ఉద్యామాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరించడంలో తెలుగుదేశం పార్టీ విఫలం అయ్యిందని చెప్పాలి.  అంతేకాదు, అభివృద్ధి వికేంద్రీకరణ అని వైకాపా చెప్తూ వచ్చింది.  మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉంటె అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనే విషయాన్ని ప్రభుత్వం పదేపదే చెప్పడం వలన ప్రజలు పెద్దగా అమరావతిపై దృష్టి పెట్టలేకపోయారు. వికేంద్రీకరణ చేస్తే అభివృద్ధి చెందుతుందని వైకాపా నాయకులు చెప్పినంత గట్టిగా రాజధానిని మూడు ప్రాంతాల్లో పెడితే అభివృద్ధి జరగదు, పాలన కూడా సరిగానిర్వహించడం కుదరదు అనే విషయాలను ప్రతిపక్షాలు గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాయి అని మాత్రం చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: