అవినీతికి ఎవరు అడ్డుకాదని సమాజంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని శాసించేది ఏదైనా ఉందంటే అది ఒక్క అవినీతి మాత్రమే. కాకపోతే అవినీతికి ఆత్మబంధువులాగా మన భారతదేశం మారింది. మిగతా దేశాల్లో ఇది ఒక స్దాయి వరకే ఉంటుంది. మన దగ్గరైతే ఏ స్దాయితో సంబంధం లేదు. పాచి పని చేసుకునే వారి నుండి. పలుకుబడి కలిగిన వ్యక్తుల వరకు ఎప్పుడో ఒకప్పుడు అవినీతి సొమ్మును అంటించుకుంటున్నవారే.

 

 

ఇకపోతే అవినీతికి ఉన్న దాహానికి దాని గొంతులో ఎంత సొమ్ము నింపిన సరిపోదు.. ఇంకా దాహమంటుంది. దీనికి కొందరు వ్యక్తులైతే బానిసలుగా కూడా మారారు.. చేయి తడపందే పనులు జరగవు.. ఇకపోతే ప్రజలను రక్షించవలసిన బాధ్యత గల వృత్తిలో ఉండి కూడా ఒక చిల్లర దొంగ వేసే వేషాలు వేసిన ఈ పోలీసును చూస్తే ఇతనికంటే ఆ దోంగోడే నయం అనిపిస్తుంది. కనీసం వాడైనా ఉన్నవారు లేని వారు అని చూస్తాడు. కాని ఇక్కడ కనిపించే పోలీసుకు అక్కడి ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోనట్లుంది.

 

 

ఇదే కాకుండా ఆకలి కోసం అలమటించే అనాధ శరనార్ధులు కూడా వారి ముందు వేరేవారి వస్తువులు ఉన్నా వారిని అడగందే ముట్టుకోరనిపిస్తుంది. ఇక ఇక్కడ మనకు కనిపించే దృష్యంలో పోలీసు తన చేతివాటం ప్రదర్శించి అక్కడున్న పాల ప్యాకెట్లను దొంగిలిస్తున్నాడు.. దొంగల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే.. ఇలా దొంగవతారం ఎత్తడం అది బహిరంగ ప్రదేశంలో, అక్కడ సీసీ కెమెరాలు ఉన్న విషయాన్ని కూడా గుర్తించక పోవడం అతని పోలీసు తెలివి తేటలకు నిదర్శనం.

 

 

ఇకపోతే ఇతను నిజానికి పోలీసు వ్యవస్దలోని లోపాలను తనకు తెలియకుండానే తెలియపరిచాడు. ఇప్పటికే ప్రజల్లో పోలీసులపై ఉన్న అభిప్రాయం ఈ దెబ్బతో కాస్త తుడిచి పెట్టుకుపోవడం ఖాయమంటున్నారు. ఈ వీడియో చూసిన వారు. ఇకపోతే ఈ ఘటన నొయిడాలో జరిగింది.. అక్కడ గస్తీ కాస్తున్న పోలీసు ఓ వీధి బయట ఉంచిన పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ కెమేరాకు చిక్కారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: