అ ఆ లే పలకడం రాని అబ్బాయిని పిల్లలకు పాఠాలు బోధించమంటే అతని పరిస్దితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఒక వైపు తెలియని పాఠాలు చెప్పాలని, మరో వైపు ఎవరైనా నవ్వుతున్నారో ఏమో అని బిత్తిరి చూపులు చూస్తూ ఉన్న పిల్లాడిలా మారిందట ఇప్పుడు లోకష్ పరిస్దితి. ఇకపోతే ఇప్పుడు టీడీపీ తామేదో సాధించామని అనుకుంటు తెగ మురిసిపోతుంది. కాని వారి ఆనందం ఆవిరవడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఎందుకంటే మండ‌లిలో వికేంద్రీక‌ర‌ణ బిల్లు ఆగ‌డం కేవ‌లం తాత్కాలిక‌మే అని స్ప‌ష్టం అవుతూ ఉండగా, కొంద‌రు నిపుణులు మాత్రం ఉభ‌య స‌భ‌ల‌నూ స‌మావేశ ప‌రిచి, ఈ బిల్లును ఆమోదింప‌జేసుకోవ‌చ్చ‌ని స‌ల‌హాలు కూడా ఇస్తున్నారట..

 

 

అయితే ప్రస్తుత పరిస్దితుల్లో శాస‌న‌మండ‌లిని కనుక ర‌ద్దు చేసేస్తే ఒక శాస‌న‌స‌భ మాత్ర‌మే మిగులుతుంది. అందువల్ల వికేంద్రీక‌ర‌ణ బిల్లు అమ‌లు కోసం మరో మూడు నెల‌ల వరకు  ఆగ వలసిన అవ‌స‌రం ఏ మాత్రం ఉండ‌దు. అప్పుడు ప్ర‌భుత్వం చేసిన శాస‌నం అమ‌ల‌వుతుంది.. ఇకపోతే ఒకవేళ శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేసేస్తే జగన్ కు వచ్చే నష్టం ఏం లేదు. చిన్న ఇబ్బందులు తప్పా. ఇకపోతే ఇలా జరగడం వల్ల లోకేష్ మాత్రం రాజ‌కీయ నిరుద్యోగిగా మిగలడం ఖాయం..

 

 

అదీ గాకుండా ఎన్నిక‌ల్లో  ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కూడా లోకేషం గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా కొన‌సాగుత‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక కొంద‌రు నేత‌లు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి ముందే ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసినా.. లోకేష్ మాత్రం ఆ ధైర్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయారు. అంతే కాకుండా ప్ర‌జ‌లు తిర‌స్క‌రించిన కూడా త‌న‌కన్నా తోపు లేడ‌న్న‌ట్టుగా, లోకేష్, ఎమ్మెల్సీగా రాజ‌కీయం చేస్తూన్నారు.

 

 

ఇలాంటి నేప‌థ్యంలో మండ‌లి గ‌నుక ర‌ద్దు అయితే.. చంద్ర‌బాబు త‌న‌యుడిగా మాత్ర‌మే లోకేష్ మిగిలిపోయే అవ‌కాశాలున్నాయి. ఇలాంటి పరిస్దితులో పొలిటిక‌ల్ కెరీర్ ఆరంభంలోనే మాజీ ఎమ్మెల్సీ అని చెప్పుకోవాల్సి వ‌స్తే లోకేష్ ప‌రిస్థితి ఏమిటో తలుచుకుంటేనే అర్ధం కావడం లేదు. మరి ఈ విషయాన్ని ఆలోచించని లోకేషం కాలుగాలిన పిల్లిలా అధిక ప్రసంగాలు చేయడం ఎంతవరకు సబబు అని అనుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: