ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే కాకుండా యావత్ భారత దేశంలోనూ మూడు రాజధానులు విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా తన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి శాసనమండలిలో రాజధాని వికేంద్రీకరణకు చెక్ పెట్టడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. శాసనసభలో గంటల తరబడి కొనసాగిన చర్చల తర్వాత మూడు రాజధానులకు ఆమోదం పొందిన వారు ఒక్కసారిగా ఇలా చావుదెబ్బ తినడం వారి ఆత్మస్థైర్యాన్ని బలంగా దెబ్బ తీసింది అని చెప్పాలి.

 

అయితే జగన్ మాత్రం పట్టువదలకుండా నిన్న శాసనసభలో అసలు శాసనమండలి ఈ యొక్క అవసరాన్ని గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు శాసనమండలి అవసరమే లేదు అని చెప్పిన జగన్ దానిని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు మునుపు 1958లో కూడా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు ఎటువంటి సమస్యే రాగా అతను శాసనమండలిని రద్దు చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2021 జూలై వరకు శాసనమండలిలో టిడిపి ఆధిపత్యమే ఉంటుంది కాబట్టి జగన్ కు తక్షణమే దాన్ని రద్దు చేయడం తప్ప మరొక దారి లేదనే చెప్పాలి.


అయితే ఇందులో ఒక పెద్ద తిరకాసు ఉంది. రాష్ట్రానికి జగన్ సీఎం అయినప్పటికీ శాసన మండలి రద్దు కు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. ఇక పార్లమెంటు దీనిపై ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటుంది.... ఎంత తక్కువ సమయంలో దీన్ని గూర్చి ముందుకు వెళుతుంది అనే విషయం కేంద్రం పైన ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం శాసన మండలి రద్దు పై ఆసక్తి చూపించకపోతే దాదాపు ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సంవత్సరం పైగా పట్టొచ్చు. అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

 

నిన్న పవన్ చెప్పిన దాని ప్రకారం అసలు మోడీ మూడు రాజధానుల విషయంలో సముఖంగా లేదని అర్థమవుతోంది. ఇప్పుడు జగన్ ను చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్న మోడీ తర్వాత ఏం చేయబోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో అని అందరిలో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: