సీఎం కేసీఆర్ ఏ కొందరి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి.. తనదైన శైలిలో మున్సిపల్ ఎన్నికల్లో రానిచ్చాలని అనుకుంటున్నారట.. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అవకాశం తక్కువ ఉన్న వారిని.. వాళ్ళ అభ్యర్థులు కాకుండా పక్క అభ్యర్థులు అంటే రెబెల్స్, ఇండిపెండెంట్లు గెలిచే వారిని మచ్చిక చేసుకోవాలని సూచిస్తున్నారట.. 

 

అసలు విషయానికి వస్తే.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాకముందే టిఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. కొన్ని ప్రాంతాల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి క్యాండిడేట్లను క్యాంపులకు తరలిస్తున్నారు.. సొంతంగా పార్టీకి మెజారిటీ రాని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గుర్తించి అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టమన్నారట. 

 

ఏ ప్రాంతాల్లో అయితే గెలవారో.. అక్కడ గెలిచినా చైర్​పర్సన్​, మేయర్​ పీఠాలను సొంతం చేసుకునేందుకు గులాబీ పెద్దలు వ్యూహం వేసి దాన్ని అమలు చేస్తున్నారు అని సమాచారం. ఇప్పటికే గులాబీ పెద్దలు ఆ మున్సిపాలిటీ ఎమ్మెల్యేలకు సూచనలు.. సలహాలు ఇస్తున్నారు. క్యాండిడేట్లను క్యాంపులకు తరలించాలని, గెలిచే అవకాశం ఉన్న రెబల్స్​ను, ఇండిపెండెంట్లను మచ్చిక చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సమాచారం.

 

ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఏ రంగంలోకి దిగారని సమాచారం.. '''వెంటనే క్యాంపులు పెట్టండి. అవసరమైన చోట రెబల్స్ ను, ఇతర పార్టీల వారిని  తీసుకోండి. చైర్​పర్సన్​, మేయర్ పదవి అవతల పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కొద్దు'' అని కొందరు ఎమ్మెల్యేలకు, లీడర్లకు  ఫోన్లు చేసినట్లు సమాచారం. 

 

రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలకు, 9 కార్పొరేషన్లకు రేపు ఫలితాలు వస్తాయి.. అలాగే ఈ నెల 27న చైర్ పర్సన్, మేయర్ ఏలిన జరుగుతుంది.. ఈ నేపథ్యంలోనే అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని కార్పొరేషన్లలో గులాబీ జండా ఎగరవెయ్యాలని టీఆర్​ఎస్​ పట్టుదలతో ఉంది. దీంతో ఎక్కడ అయితే ఆ పార్టీ అభ్యర్థులు కాకుండా వేరే వారు గెలుస్తారో అక్కడే వారిని తమ వైపు తిప్పుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. 

 

అంతేకాదు..  మేయర్, చైర్​పర్సన్​ పదవులు దక్కించుకోడానికి కావాల్సిన సంఖ్యా బలం రావని భావిస్తున్న చోట క్యాంపులు పెట్టాలని ఎమ్మెల్యేలకు, లీడర్లకు టీఆర్​ఎస్​ హైకమాండ్​ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. మరి వీరి వ్యూహం ఎంతవరుకు పని చేస్తుందో.. ఎన్ని చోట్లా గులాబీ జండా ఎగురుతుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: