రాజధానిని అమరావతి నుండి అంగుళం కూడా కదిల్చేందుకు వీల్లేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఎంతగా పట్టుబడుతున్నారో అందరూ చూస్తున్నదే. నిజానికి పవన్ పట్టుబడితే అయిపోవటమో ? లేకపోతే ఆగిపోవటమో ? జరిగేదేమీ లేదని అందరికీ తెలిసిందే. అయినా కానీ తాను తలచుకుంటే రాజధాని తరలింపు ఆగిపోతుందని జనాలకు భ్రమలు కల్పిస్తున్నారు పవన్.  రాజధాని తరలింపుపై పవన్ ఎందుకింత సీన్ క్రియేట్ చేస్తున్నారు ?

 

ఎందుంకంటే పవన్ కూడా అమరావతి ప్రాంతంలో భారీగా భూములున్నాయట.  ఈ విషయాన్ని వైసిపి అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి చెప్పారు. అంటే పవన్ కొనుగోలు చేసిన భూములు ఇన్ సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి రాకపోయినా రాజధాని తరలిపోతుందంటే భూముల ధరలు ఎంతో కొంత  పడిపోవటం ఖాయమే కదా ? తనతో పాటు తన తల్లి పేరుతో కూడా పవన్ భూములు కొన్నట్లు రెడ్డి చెబుతున్నారు.

 

రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం అమరావతి ప్రాంతంలోని రాజులపాలెం, లింగాయపాలెం గ్రామాల్లోని సర్వే నెంబర్లు  64 బి, 67 బి, 83 బిలో,  మందడం గ్రామంలోని  సర్వే నెంబర్లు  131 ఎ, 139 ఎ లో  62 ఎకరాలు కొన్నట్లు డాక్యుమెంట్లు చూపారు. అలాగే తన తల్లి అంజనాదేవి పేరుతో కూడా మరో 20 ఎకరాలు కొన్నారట. ఈ భూములను 2018 ఏప్రిల్, ఆగస్టు ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు చెప్పారు.

 

తాను కొనుగోలు చేసిన భూముల ధరలు ఎక్కడ పడిపోతాయో అన్న ఆందోళనతోనే పవన్ రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలంటూ జనాలను రెచ్చ గొడుతున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.  చంద్రబాబునాయుడు అండ్ కో పాల్పడిన  4070 ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ ముందు పవన్  కొనుగోలు చేసిన భూములు తక్కువనే చెప్పాలి. అయితే ఇద్దరు కూడా ఇపుడు రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా  చేస్తున్న పోరాటాలకు  కామన్ పాయింట్  మాత్రం కొనుగోలు చేసిన భూములే అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: