నారావారి పుత్రరత్నం నారా లోకేష్ పై సిఐడి పోలీసులు  ఇన్ సైడర్ ట్రేడింగ్  కేసు నమోదైంది. విషయం బయటకు రాగానే పార్టీలో సంచలనం మొదలైంది. మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పొంగూరు నారాయణ పై ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భారీగా భూములు కొనుగోలు చేసిన ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు సిఐడి ఎస్పీ మేరి ప్రకటన చేసిన విషయం  తెలిసిందే. ఎస్పీ ప్రకటనతో పార్టీలో కలకలం మొదలైంది.

 

అయితే సిఐడి బయటకు ప్రకటన చేయని విషయం ఏమిటంటే మాజీ మంత్రి లోకేష్ పైన కూడా కేసు నమోదైంది. ఇదే ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపైన  418 ఐపిసి, 420, 406, 409 సెక్షన్ల క్రింద నాలుగు కేసులు నమోదయ్యాయి. లోకేష్ బినామీలుగా వేమూరి  రవికుమార్ ప్రసాద్, కనుమూరి కోటేశ్వరరావు, చెఱుకూరి రామకృష్ణ పేరు మీద భూములు కొన్నట్లు ఆరోపణలున్నాయి.

 

ఏప్రిలో 214- 2019 ఏప్రిల్ మధ్య కాలంలో  వైకుంఠపురం, మందడం, వెంకటాయపాలెం, ధరణికోట గ్రామాల్లో సుమారు  26 ఎకరాలు కొన్నట్లు సిఐడి నిర్ధారించింది. అలాగే ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ కూడా భారీగానే భూములు కొన్నట్లు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో  పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించిన విషయం అందరూ చూసిందే.

 

ప్రభుత్వం ఆరోపణల ప్రకారమైతే చంద్రబాబునాయుడు అండ్ కో సుమారు 4070 ఎకరాలను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో  దోచేసినట్లు ఇప్పటి వరకూ బయటపడింది. ఇదే విషయమై ప్రభుత్వం ఇంకా మరింత లోతుగా  విచారణ చేయిస్తోంది.  ఇప్పటి వరకూ బయటపడిన సమాచారం ప్రకారం 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు అమరావతి ప్రాంతంలో టిడిపి నేతల బినామీలుగా భారీ ఎత్తున భూములను సొంతం చేసుకున్నారు.

 

అందుకనే వీరి కతేంటో తేల్చేందుకు వీళ్ళ రేషన్ కార్డులను, ఆధారా కార్డులను సిఐడి అధికారులు సేకరించి ఇన్ కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విభాగాలకు అందించారు. వీళ్ళు కూడా దర్యాప్తు పేరుతో రంగంలోకి దిగితే కేసు మరింత సీరియస్ అయ్యే అవకాశాలున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: