జనసేన అధినేత పవన్ కల్యాణ్  విషయంలో  బిజెపి అగ్ర నాయకత్వానికి ఓ క్లారిటి వచ్చేసిందా ? పవన్ మాటలు వింటుంటే, వైఖరి చూస్తుంటే ఢిల్లీ నాయకత్వానికే ఆశ్చర్యంగా ఉందట. ఏ విషయంలో కూడా స్ధిరత్వం లేని పవన్ కు అగ్రనేతలు గట్టిగా క్లాసు పీకారనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయంలో పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడటంపై ఢిల్లీ నాయకత్వం ఫుల్లుగా క్లాసు పీకినట్లు ప్రచారం జరుగుతోంది.

 

రాజధానిని అమరావతి నుండి అంగుళం కూడా కదల్చనిచ్చేది లేదని పవన్ ఒకటికి పదిసార్లు భీషణ ప్రతిజ్ఞలు చేశారు. తాను ఢిల్లీకి వెళ్ళి కేంద్రంలోని పెద్దలందరినీ కలిసి రాజధానుల విషయాన్ని మాట్లాడుతానని చెప్పారు. పవన్ తీరు చూస్తే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇక  జగన్ కు ఇబ్బందులు తప్పవేమో అనే అందరూ అనుకున్నారు.  తీరా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత  పవన్ పూర్తిగా చప్ప పడిపోయారు.

 

కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, బిజెపి అధ్యక్షుడు జేపి నడ్డాతో మాట్లాడిన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడుతూ రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అంశమే అని చెప్పటమే పెద్ద జోక్.  పవన్ ఇపుడు చెప్పిన విషయాన్నే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు ఎప్పటి నుండో చెబుతున్నారు.

 

నిజానికి పవన్ కు కూడా ఈ విషయం బాగా తెలుసు. అయినా జగన్ మీద ధ్వేషంతో  చంద్రబాబునాయుడుకు మద్దతుగా  పదే పదే నానా యాగీ చేస్తున్నారు.  రాజధానిని తరలిస్తే ప్రళయం సృష్టిస్తానంటూ చేసిన ప్రతిజ్ఞలతో పవన్ నవ్వుల పాలయ్యాడు.  సో నోటికొచ్చినట్లు మాట్లాడటం అనవసరంగా పిక్ఛర్లోకి లాగితే కేంద్రం అంగీకరించదనే వియంలో పవన్ కు ఓ క్లారిటి వచ్చేసింది. ఇక రావాల్సింది ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరికే.

మరింత సమాచారం తెలుసుకోండి: