శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ తెలుగుదేశంపార్టీతో పాటు అధినేత చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే ఇచ్చారు. అసెంబ్లీ ఆమోదం పొందిన రెండు బిల్లులు  మండలిలో సెలక్ట్ కమిటికి వెళ్ళనే లేదని స్పష్టంగా ప్రకటిచాంరు.  రెండు బిల్లులను షరీఫ్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి సెలక్ట్ కమిటికి పంపినట్లు చంద్రబాబు, యనమల రామకృష్ణుడు తదితరులు పెద్దగా ప్రచారం చేశారు. దానికి తగ్గట్లే చంద్రబాబుకు పూలవర్షం కురిపించిన రాజధాని గ్రామాల ప్రజలు షరీఫ్ ఫొటోకు పాలాభిషేకం చేశారు.

 

నిజానికి మండలిలో రెండు బిల్లులపై అధికార పార్టీ ముందు చర్చ తర్వాత ఓటింగ్ కు పట్టుబట్టింది. అయితే టిడిపి మాత్రం చర్చ, ఓటింగ్ విషయంలో నానా రాద్దాంతం చేసింది. చివరకు రెండు రోజులైనా గొడవ సద్దుమణగకపోతే చివరకు మండలి ఛైర్మన్ జోక్యం చేసుకున్నారు. తన విచక్షణాధికారాలను ఉపయోగించి రెండు బిల్లులను సెలక్ట్ కమిటి పరిశీలనకు పంపుతున్నట్లు ప్రకటించేశారు. పైగా తాను తప్పు చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు.

 

నిజానికి బిల్లులను సెలక్ట్ కమిటికి తనంతట తానుగా  పంపే  విచక్షణాధికారం ఛైర్మన్ కు లేదు. పైగా నియమ, నిబందనలకు విరుద్ధంగా పంపుతున్నట్లు చెప్పిన ఛైర్మన్ కమిటిని నియమించకుండానే నిరవధిక వాయిదా అంటూ ప్రకటించేసి వెళ్ళిపోయారు. దాంతో షరీఫ్ చేసిన ప్రకటన సాంకేతిక తప్పని అర్ధమైపోయింది. అయితే ఛైర్మన్ ప్రకటన చేయగానే టిడిపి నేతలు పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలో సంబరాలు చేసుకున్నారు. ఎల్లోమీడియా కూడా బ్రహ్మాండం ఊడిపడిపోయినట్లు ప్రచారం చేసేసింది.

 

తీరా చూస్తే చివరకు ఛైర్మనే మీడియాతో మాట్లాడుతూ బిల్లులు సెలక్ట్ కమిటికి పంపే ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయిందని ప్రకటించారు. సెలక్ట్ కమిటికి వెళ్ళిందని టిడిపి చేస్తున్న ప్రచారంలో నిజం లేదని కూడా చెప్పటంతో చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియాకు పెద్ద షాక్ తగిలింది. తాను చేసిన ప్రకటన సాంకేతిక కారణాలతో మధ్యలోనే ఆగిపోయిందని కూడా చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: