తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు వ్యవహరించిన రాజకీయం తాజాగా విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న రాజకీయం అసలు వ్యత్యాసమే లేదని చంద్రబాబు లో చాలా మార్పులు వచ్చాయి అని సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తన సమకాలికుడు ప్రత్యర్థిగా ఉండే వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్ ని చంద్రబాబు తన ప్రత్యర్థిగా ఊహించలేక పోతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువగా ఉన్న క్రమంలో విభజన సందర్భంలో హైదరాబాద్ నగరం కోల్పోవడంతో ఈ సమస్య తలెత్తిందని ఇటువంటి సమస్య మరొకసారి భవిష్యత్తులో ఆంధ్రాలో రాకూడదు అని రాష్ట్రం మళ్లీ విభజనకు గురి కాకూడదనే ఉద్దేశంతో వైయస్ జగన్ తెరపైకి తెచ్చిన వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును చంద్రబాబు నాయుడు శాసనమండలిలో రద్దు చేయడంతో అమరావతి ప్రజలు రైతులు చంద్రబాబు చేసిన తీరు పట్ల జేజేలు పలుకుతున్నారు.

 

అయితే దీనంతటికీ కారణం చంద్రబాబు అమరావతి రాజధాని ప్రాంతాల ప్రజలు మరియు రైతుల దృష్టిలో హీరో కావడానికి గల కారణం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన అప్పట్లో శాసనమండలి తీసుకురావడం వల్లే చంద్రబాబు సేవ్ అయ్యారని రాజధాని ప్రాంత ప్రజల దృష్టిలో తలెత్తుకునే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు తనతో పాటు పనిచేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ లోకి వెళ్లాలి అన్ని రాజకీయ సలహా ఇచ్చిన వైయస్ తాజాగా తన హయాంలో ఎన్టీఆర్ రద్దు చేసిన శాసనమండలిని మళ్లీ తెరపైకి తీసుకువచ్చి తాజాగా చంద్రబాబు ని ఆదుకున్నాడు అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా వైయస్ ఆలోచనా మేరకు 2004లో వచ్చిన శాసనమండలి అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబుని ఆదుకుంది అంటూ అటువంటి శాసనమండలిని జగన్ రద్దు చేస్తాడో ఏం చేస్తాడో చూడాలి అంటూ మేధావులు చర్చిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: