అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో  చంద్రబాబునాయుడు  జోలె పట్టకు తిరిగిన విషయం అందరికీ తెలిసిందే.  ఉద్యమ విరాళాల పేరుతో మచిలీపట్నం, తిరుపతి, నరసరావుపేట, ఏలూరు, భీమవరం లాంటి ప్రాంతాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ  జోలె పట్టి  ఎంత నిధులు రైజ్ చేశారో తెలుసా ? సోషల్ మీడియాలో వస్తున్న లెక్క ప్రకారం సుమారు రూ. 75 లక్షల రూపాయలట. ఇది కాకుండా గోల్డ్ కూడా బాగానే వచ్చింది.

 

నిజానికి అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలన్నింటినీ ఎండగట్టి కేవలం అమరావతి మీద మాత్రమే దృష్టి పెట్టారు. అందుకనే మిగిలిన జిల్లాల్లో చంద్రబాబుపై పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. విచిత్రమేమిటంటే అమరావతి ప్రాంతంలో చేసిన అరాచకాల వల్ల ఇక్కడ కూడా టిడిపి ఓడిపోయింది. పోనీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతైన బుద్ధి తెచ్చుకున్నారా అంటే ఏమీ మారలేదు.

 

రాజధానిని  తరలించేందుకు లేదంటూ మళ్ళీ అమరావతి కోసమే రాష్ట్రమంతా జోలె పట్టుకుని తిరిగారు. ఉద్యమ విరాళాల పేరుతో చంద్రబాబు తిరిగిన చోటల్లా క్యాష్ తో పాటు బంగారు ఆభరణాలు కూడా విరాళాల రూపంలో అందుకున్నారు. భార్య భువనేశ్వరి రెండు గాజులను ఎరగా వేసి పెద్ద ఎత్తునే విరాళాలను రైజ్ చేశారు.

 

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 112 ఆభరణాలు వచ్చాయట. ఇందులో బంగారు గాజులు 24, బంగారు ఉంగరాలు 29, బంగాకె చెవిపోగులు 41, బంగారు బ్రాస్లెట్లు 2, బంగారు గొలుసులు 3, బంగారంతో చేసిన నల్లపూసల గొలుసులు 2, వెండిపట్టాలు 9, వెండి గొలుసు 1, వెండి నాణెం 1 వచ్చాయట. మొత్తానికి రెండు గాజులను ఎరగా వేసి చంద్రబాబు మిగిలిన వాళ్ళ దగ్గర బాగానే రైజ్ చేశారు.

 

అసలు ఉద్యమం పేరుతో చంద్రబాబు విరాళాలు సేకరించటమే విచిత్రంగా ఉంది. విరాళాలతో నడిచే ఉద్యమం పెయిడ్ లేకపోతే కృత్రిమ ఉద్యమం కాక మరేమిటి ? సమస్య అందరిదీ అనుకుంటే జనాలే  రోడ్ల మీదకు రాకుండా ఉంటారా ? ఊరూరు తిరిగి చంద్రబాబు రమ్మని పిలవాలా ? పోని పిలిచినా వచ్చారా  అంటే అదీ లేదు. రోషం లేదా ? పౌరుషం లేదా ? అంటూ జనాలను చంద్రబాబు ఎంత రెచ్చగొట్టినా ఫలితం లేకపోయింది కదా. మరి విరాళాలన్నింటినీ ఏం చేస్తారో చూద్దాం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: