తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెల కొంది. మరి కొద్ది గంటల్లో రిజల్ట్ రానున్న సందర్భంగా ఇప్పటికే నాయకులు తామంటే, తామే గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. ఇక టీఆర్‌ఎస్‌ ప్రతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఇప్పటివరకు తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటు వస్తుంది. ఇప్పుడు తాజాగా జరిగిన ఈ మున్సిపల్ ఎలక్షన్లలో కూడా తమదే పై చేయి అని కొందరు నాయకులు విందులు కూడా చేసుకుంటున్నారట.

 

 

ఇకపోతే అన్నీంటికంటే బోడుప్పలో కార్పొరేషన్‌లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే  ఈ పీఠం పై టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకున్నాయి. అయితే బోడుప్పల్‌లో టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌ తీవ్రమైన పోటీని ఇచ్చిందనడంలో సందేహం లేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.. ఇదిలా ఉండగా మొత్తం 28 డివిజన్లకు గాను మెజారిటీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందుతుందనే నమ్మకాన్ని కొందరు నాయకులు వెలుబుచ్చుతున్నారట. అంతే కాకుండా 6 డివిజన్లలో మాత్రం చాలా క్లిష్ట పరిస్దితులు నెలకొనగా, రెండు  చోట్ల మాత్రం కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మధ్య తీవ్రమైన పోటీ ఉందంటున్నారు..

 

 

మరో రెండు చోట్ల బీజేపీ, ఇండిపెండెట్‌ అభ్యర్థులు కూడా గట్టి పోటీని ఇవ్వడంతో ఫలితాలపై, ముఖ్యంగా మేయర్‌ పీఠంపై ఉత్కంఠ నెలకొందట.. ఇలాంటి పరిస్దితుల్లో ఆ 6 డివిజన్ల ఫలితాలే మేయర్‌ పీఠానికి కీలకం అవనున్నాయని పలువురు భావిస్తున్నారు. ఇకపోతే కాంగ్రెస్‌ గనుక లక్కీగా టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీనిచ్చి దానితో సమానంగా అభ్యర్థులను గెలుచుకుంటే, అప్పుడు కీలకమైన ఆ 6 డివిజన్లలోని బీజేపీ, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది..

 

 

ఇక ఇప్పటికే టీఆర్‌ఎస్‌ బాస్ అయిన కేసీయార్ ఓడిపోయిన వాళ్ల పదవులను పీకేస్తానని చెప్పిన విషయాలు తలుచుకుంటే ఆయా డివిజన్లలో పెద్దరికాన్ని వెలగబెట్టే నాయకులకు ఈ మాటలతో పంచెలు నానుతుండగా, తెలవారితే గాని ఏవరి జాతకాలు ఎలా మారనున్నాయో  అని నిదుర కూడ పోకుండా ఎదురు చూస్తున్నారట. నిజమే కదండి అన్నేసి డబ్బులు పంచి, మందు బాటిళ్లను మంచినీళ్లలా ఖర్చు చేసిన వారికి ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదా అని అనుకుంటున్నారట  ప్రజలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: