మామూలుగా చేపలంటే ఎవరైనా భయపడతారా... చేపలు చూస్తే ఎందుకు భయం... చేతికి దొరకాయంటే  వండుకుని తినొచ్చు అంటారు. అయితే చేపలు నీటిలో ఉన్నప్పుడు ఎంత బలంగా ఉంటుందో నీటి బయటకు వచ్చిన తర్వాత అంత బలహీనంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. నీటి  బయటకు వచ్చింది అంటే చేప చచ్చిపోతుంది. కానీ ఇక్కడ ఒక చేప మాత్రం ఏకంగా నీటిలోనుంచి పైన ఎగిరి  ఓ యువకుడి మెడకు గాయం చేసింది . ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక ఆ చేప బాలుడి  మెడకు గాయం చేయడంతో ఆ యువకుడు విలవిలలాడి పోయాడు. చేప నీళ్ళలోంచి ఎగిరి మెడకు  గాయం చేయడం ఏంటి అంటారా... అది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. 

 

 

 ఇండోనేషియా లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది . సులావేసి దీవిలో తన తల్లిదండ్రులతో కలిసి బోట్ లో  చేపల వేటకు వెళ్ళాడు 16 ఏళ్ల బాలుడు. అయితే చేపలకు వలవేస్తున్న సమయంలో... నీటిలోంచి ఓ చేప గాల్లోకి ఎగిరి అతడి మెడ గుచ్చుకుంది. ఆ చేప ముక్కు బాగా షార్పుగా ఉండడంతో.. మెడకు గుచ్చుకున్న ఆ చేప  ఇటు పక్క నుంచి అటు పక్కకు వచ్చేసింది. ఇక చేప దెబ్బకు ఆ బాలుడు నీటిలో పడి పోయాడు. అయితే ఇంతకీ అతని మెడలో గుచ్చుకున్న చాప మాత్రం బయటికి రాలేదు. దీంతో అతడు బాధతో విల విల లాడుతూనే అతికష్టం మీద ఈదుకుంటూ  బోట్ లోకి చేరుకున్నాడు. ఇక బోట్ ను  హుటిన  ఒడ్డుకు తీసుకు వచ్చిన తల్లిదండ్రులు ఆ బాలుని ఆస్పత్రికి తరలించారు. 

 

 

 అయితే ఆ బాలుడు మెడకు  చేప తీవ్రమైన గాయం చేయడంతో మెడ నుంచి ఆ చేపని  బయటకు లాగితే... రక్తస్రావమై బాలుడు చనిపోతాడని భావించిన వైద్యులు వెంటనే ఆ చేపను లాగకుండా రెండు రోజుల పాటు ఆ చేపను అతడి మెడలోనే  ఉంచేశారు. ఇక ఆ తర్వాత రెండు గంటలపాటు శ్రమించి.. ఎంతో జాగ్రత్తగా సర్జరీ చేసి ఆ బాలుడు మెడ నుంచి ఆ చేప ముక్కును బయటకు లాగారు. కాగా  ఆ బాలుడి మెడ కు గాయం చేసిన చేప పేరు నీడిల్ ఫిష్ అంటారు. దీని  ముక్కు చాలా పొడవుగా ఉంటుంది. కాగా  ఇది నీటిలో గంటకు 37 మైళ్ళ వేగంతో ఎగురుతూ ప్రయాణిస్తుంది. కాగా చేప దాడిలో గాయపడిన బాధితుడు  ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: