ఇప్పటికే నూతన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రెండు సార్లు అధికారాన్ని చేపట్టిన టిఆర్ఎస్ పార్టీ, అలానే ముఖ్యమంత్రి కేసీఆర్, తనవంతుగా రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఆ పార్టీ పై అక్కడక్కడ వ్యతిరేకత ఉన్నప్పటికీ, మెజారిటీ ప్రజల మనసు మాత్రం ఆ పార్టీ గెలుచుకుంటోంది. ఇకపోతే ఇటీవల జరిగిన తెలంగాణ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ జరిగిన 9 స్థానాలను కూడా టిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని చాలావరకు సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఆ సర్వే సంస్థల్లో ఒకటైన సిపిఎస్ సర్వే సంస్థ కూడా టిఆర్ఎస్ దే మెజారిటీ అని అంటోంది.

 

కాగా ఒక్క స్థానంలో మాత్రం ఆ పార్టీకి బిజెపి నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని ప్రముఖ సర్వే సంస్థల్లో ఒకటైన సిపిఎస్ సర్వే చెపుతోంది. ఇక ఈనెల 22న జరిగిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్న సందర్భంగా దాదాపుగా అన్ని స్థానాల్లో కూడా టిఆర్ఎస్ హవానే పూర్తిగా కొనసాగనుందని ఆ సర్వే సంస్థ చెపుతోంది. ఇక మొత్తం 120 మున్సిపాలిటీల్లో 104-109 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచే అవకాశముందని, అలానే కాంగ్రెస్‌కు 0-4, బీజేపీకి 0-2, ఎంఐఎంకు 1-2 స్థానాలు రావొచ్చని సిపిఎస్ సర్వే తెలిపింది. కాగా 7-10 మున్సిపాలిటీల్లో హోరాహోరీ ఫలితాలు ఉండవచ్చని అంటున్నారు. 

 

ఇక దీనితో మునిసిపల్ ఎన్నికల్లో కూడా కారు జోరుకు అటు హస్తం కానీ, ఇటు కమలం కానీ అడ్డుకట్ట వేయలేకపోయాయని, ఈ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంతవరకు ఉండే ఛాన్స్ ఉందని ఆ సంస్థ అభిప్రాయపడుతోంది. మరి ఆ సంస్థ సర్వే నివేదికలు ఎంతవరకు నిజం అవుతాయో తెలియాలంటే రేపు ఫలితాలు వెళ్లాడయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఇదే జరిగే అవకాశం ఉందని మరొకవైపు టిఆర్ఎస్ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నాయి. మరి రేపు ఏమి జరుగుహఃతుందో చూద్దాం......!!

మరింత సమాచారం తెలుసుకోండి: