తెలుగుదేశం పార్టీ వీడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షం లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో లాంఛనంగా చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత స్వరం మారింది . నిన్న,  మొన్నటి  వరకూ అధికార పార్టీని విమర్శించిన ఆమె , పార్టీ వీడి , వీడగానే టీడీపీ ఎమ్మెల్సీల తీరుపై ఫైర్ అయ్యారు . మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు దుర్మారంగా  వ్యవహరించారని  ఆరోపించారు . పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను  టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు మండలి చైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీ కి పంపి చరిత్ర హీనులుగా మిగిలిపోయారని అన్నారు .

 

టీడీపీ ఎమ్మెల్సీ లు చంద్రబాబు ట్రాప్ లో పడకుండా , బయటకు రావాలని సూచించారు . ఇక తాను పార్టీ మారడానికి ప్రలోభాలు కారణం కాదని చెప్పిన సునీత , తమది ప్రజల కోసం పనిచేసే కుటుంబమని చెప్పుకొచ్చారు . మండలిలో సరిపోను బలంలేని అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ,  పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు  గట్టెక్కాలంటే , విపక్ష టీడీపీ ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకోవాలని భావించింది  . ఈ నేపధ్యం లో   అధికార పార్టీ , పోతుల సునీత , శివనాగిరెడ్డి ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది . మండలిలో రూల్ 71 పై ఓటింగ్ సందర్బంగా వీరిద్దరూ , టీడీపీ నాయకత్వానికి ఝలక్ ఇచ్చారు . పోతుల సునీత , తన భర్త సురేష్ తో కలిసి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు రెడీ అయిపోగా , నాగిరెడ్డి ఇంకా తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు .  

 

తమ పార్టీ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు . సునీతను అన్నివిధాలుగా ప్రోత్సహించి ఆదుకున్నట్లు చెప్పుకొచ్చారు . ఇక శివనాగిరెడ్డి కి రామసుబ్బారెడ్డి చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి ఆయనకు ఇచ్చినట్లు వివరించారు . అయితే ప్రస్తుత  రాజకీయాల్లో పార్టీ మారడమే ఆలస్యం నిన్న, మొన్నటి వరకు అదేపార్టీ లో కొనసాగమన్న విషయాన్ని కూడా విస్మరించి నేతలు విమర్శలు చేయడం ఇటీవల పరిపాటిగా మారింది . అందుకు పోతుల సునీత మినహాయింపేమీ కాదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: