మూడు రాజధానులు విషయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఫస్ట్ నుండి ఏపీ ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజల చేత మాత్రమే ధర్నాలు నిరసనలు చూపించగలిగారు గాని మిగతా చోట్ల ఉన్న ప్రజల చేత ప్రభుత్వంపై ఏ మాత్రం వ్యతిరేకత తీసుకురాలేకపోయారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వికేంద్రీకరణ పేరిట వైయస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల విషయంలో అసెంబ్లీలో చాలా దూకుడుగా వ్యవహరించి బిల్లును అసెంబ్లీలో ఆమోదం పొందేలా చేసిన శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ తనకు అధిక బలం వుండటం చేత బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించడంతో మూడు రాజధానుల నిర్ణయం అటూ ఇటూ కాకుండా ఉండటంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న ఈ బిల్లు అటూ ఇటూ కాకుండా ఇరుక్కుపోవడం వల్ల అసెంబ్లీలో చాలా ఆవేదన చెందారు.

 

అయితే శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ఉద్దేశపూర్వకంగా బిల్లును ఆపడం పట్ల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో... శాసన మండలి లో ఉన్న పెద్దలు మేధావులు సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యుల చేత ఆమోదం పొందిన బిల్లులు మండలి లో ఉన్న పెద్దలు రాజకీయంగా అడ్డుకోవటం ఏ మాత్రం సబబు కాదని మాట్లాడుతూ శాసన మండలి రద్దు అనే అంశాన్ని జగన్ తెరపైకి తీసుకు రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

 

అసలు శాసనమండలిని అప్పట్లో స్వర్గీయ ఎన్టీఆర్ రద్దు చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్సార్ తీసుకరావడం జరిగిందని అటువంటిది తండ్రి పెట్టిన సభను జగన్ రద్దు చేయాల వద్దా అనేది అతనే నిర్ణయించుకోవాలని కొంతమంది కామెంట్ చేస్తుంటే మరికొంతమంది ప్రజలకు ఉపయోగపడే పథకాలు విషయంలో బిల్లుల విషయంలో అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన పెద్దలు అడ్డుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికే ప్రమాదమని శాసన మండలి రద్దు విషయంలో జగన్ తీసుకొన్ననిర్ణయం కరెక్ట్ అని కొంతమంది సమర్థిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: