శాసన మండలి ఔన్యత్యాన్ని చైర్మన్ కాల  రాశారని ఎమ్మెల్సీ పోతుల సునీత విమర్శించారు. మండలి సభలో టీడీపీ సభ్యలు వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. బిల్లు ఆగదని తెలిసి కూడా టీడీపీ సభ్యలు అడ్డుకున్నారని అన్నారు. చంద్రబాబు గ్యాలరీకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. శాసన మండలి చైర్మన్ పై చంద్రబాబు రాజకీయ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ప్రజలు చికొట్టినా  చబడరబాబుకి ఇంకా బుద్ది రాలేదని మండిపడ్డారు.

శాసన మండలిని చంద్రబాబు భ్రష్టు  పట్టించారని ఎమ్మెల్సీ సునీత తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ విషయంలో శాసన మండలి సభ్యలురాలుగా బాధ పడ్డాను అని చెప్పారు. చంద్రబాబు మాయ నుంచి టీడీపీ సభ్యలు బైటకు రావాలని ఆమె పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతి సభ్యుడు మద్దతు తెలపాలని సూచించారు, ఒక పార్టీకి చైర్మన్ గా షరీఫ్ వ్యవహరించారని విమర్శించారు. 

సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపడం చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతుందని ఎమ్మెల్సీ అన్నారు. అభివృద్ధి పరిపాల వికేంద్రీకరణను అడ్డుకోడానికి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారని అన్నారు. నా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని తెగేసి చెప్పారు. ప్రలోభాలకు గురి కావాల్సిన అవసరం మాకు లేదన్నారు. మండలి రద్దుపై సీఎం వై ఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. చట్టానికి విరుద్ధంగా చైర్మన్ వ్యవహరించారన్నారు.

బిల్లు సెలెక్ట్ కమిటీకి ఇవ్వడంపై టీడీపీ ఎమ్మెల్సీలు చాలా బాధ పడుతున్నారని చెప్పారు. చంద్రబాబు మాటలు విని మోసపోయామని ఆవేదన చెందుతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు చేసిన తప్పు సరిదిద్దుకోవాలని హితవు చెప్పారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా సీఎం జగన్ కు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ సునీత పిలుపునిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: