తెలంగాణాలో పురపాలక ఎన్నికలు ఈనెల 22 వ తేదీన ముగిసిన సంగతి తెలిసిందే.  ఈ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.  మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెలువడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.  ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.  5 రౌండ్ల నుంచి 24 రౌండ్ల వరకు కౌంటింగ్ ఉంటుంది.  5 రౌండ్ల తరువాత నుంచి ఒక్కొక్కటిగా ఫలితాలు ఉంటాయి. 


అధికారులు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలకు దారితీయకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  సున్నితమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది.  ముఖ్యమైన వ్యక్తులను మాత్రమే కౌంటర్ దగ్గరకు అనుమతి ఇస్తున్నారు.  స్థానికంగా ఎవరి బలం ఎంత ఉన్నది అన్నది తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు ఉపయోగపడటాయి.  


అయితే, చాలా ప్రాంతాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. తక్కువ స్థాయిలో ఓటింగ్ జరగడం అధికార పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందా లేదంటే ప్రతిపక్షాలకు అనుగుణంగా ఓటింగ్ ప్రక్రియ జరిగిందా అన్నది చూడాలి.  అయితే, అందరి దృష్టి మాత్రం బీజేపీ ఎంపీ స్థానాలపైనే ఉన్నది.  బీజేపీ ఎంపీగా గెలుపొందిన ప్రాంతాల్లో ఎలాగైనా స్థానికంగా పట్టు సాధించాలని తెరాస పార్టీ, మజ్లీస్ లు పట్టుదలతో ఉన్నాయి.  


దానికి తగినట్టుగానే ఓటింగ్ జరిగింది.  అయితే, బీజేపీ కూడా ప్రచారం జోరుగా చేసుకున్నది.  ఎవరు పట్టు సాధిస్తారు అన్నది మరికాసేపట్లోనే తేలిపోతుంది.  120 మున్సిపాలిటీల్లోని 1647 వార్డులు, 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి.  అదే విధంగా, కరీంనగర్ పరిధిలో ఈనెల 24 వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలను ఈనెల 27 వ తేదీన ప్రకటిస్తారు.  మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలకు తలపించే విధంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో మరికాసేపట్లోనే తేలిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: